తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఇక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక మంచి సక్సెస్ అయితే అందుకుంది.
అలాగే అయాన ప్రేక్షకుడి ఐక్యు లెవల్ ను టెస్ట్ చేసే విధంగా తను సీన్లను రాసుకొని ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో చాలావరకు సక్సెస్ అవుతూ ఉంటాడు.అయితే సుకుమార్( Sukumar ) సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమాని కొంచెం డల్ గా తీసుకెళ్తాడు.
మళ్ళీ క్లైమాక్స్ లో రైజ్ చేస్తాడు.
అయితే ఈ పిరియడ్ అంతా చూస్తున్న ప్రేక్షకుడికి కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది లేదంటే బోర్ కొట్టించేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది.అందువల్లే ఈ ఒక్క విషయాన్ని గనక తను రెక్టిఫై చేసుకొని తనను తాను అధిగమించగలిగితే మాత్రం పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.నిజానికి సుకుమార్ చాలా మంచి డైరెక్టర్ కానీ కొన్ని విషయాల్లో తప్పులైతే చేస్తూ ఉంటాడు.
ఇక పుష్ప సినిమాలో కూడా అనవసరమైన కొన్ని సీన్లు ఉన్నాయి.
ముఖ్యంగా హీరోయిన్ ( Heroine )కలుసుకున్నప్పుడు మాట్లాడుతూ ఆమె ను తాకాకూడని ప్లేస్ లో తాకుతూ ఉంటాడు.ఇక ఇలాంటి కొన్ని సీన్లు సినిమాకి అవసరమా అనిపిస్తూ ఉంటాయి.అలాంటి సీన్లను కనుక రిపీట్ చేయకుండా ఈ సినిమాలో క్లీన్ గా సినిమాను చేయగలిగితే మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుంది…అందుకే ఈ సినిమాను బాగా తీసినట్టైతే సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది…
.