ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) రాజకీయ భవిష్యత్తుపై స్పస్టత నిచ్చే ప్రయత్నం చేశారు.రాజకీయాల నుంచి విరమించుకొని ఖమ్మం జిల్లా రాజకీయాలకు దూరం అవుదాం అనుకున్నానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా చెప్పేసానని అయితే మీ అభిమానం నాపై మీరు చూపుతున్న ప్రేమ , నమ్మకం నా మనసు మార్చాయని, గోదావరి జిల్లాలతో ఈ ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడిగే వరకు రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన ప్రకటించారు రాజకీయ పదవులు నాకు కొత్త కాదు అని అహం తృప్తి పరుచుకోవడానికో , అధికారాన్ని అనుభవించడం కోసమో లేక రాజకీయ ఆధిపత్యం కోసమో నేను పదవులు కోరుకోవడం లేదని, ఈ గడ్డలో ఎంతోమంది మహానుభావులు పుట్టినప్పటికీ అందరికన్నా ఎక్కువ అవకాశం ఇచ్చి గౌరవించిన ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసమే మరొకసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని తనకు ఇంతటి స్థానాన్ని ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజల రుణాన్ని తీర్చుకునే వరకు రాజకీయాలు ఒదుటపోనంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు .
![Telugu Congress, Khammam-Telugu Political News Telugu Congress, Khammam-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/08/I-will-compete-for-your-reputation-Thummalaa.jpg)
తుమ్మల కు టికెట్టు దక్కకపోవడంతో ఆయన అనుచరులు భారీ ఎత్తున సమావేశమై ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు.ఎట్టి పరిస్థితులలో నూ వెనుకకు తగ్గవద్దని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామంటూ తేల్చి చెప్పడంతో ప్రజల అభిమానం మద్దతు చూసి ఒక దశలో భావోద్వానికి గురైన ఆయన కంటనీరు పెట్టుకోవడం గమనార్హం.ఏది ఏమైనప్పటికీ జిల్లా పై తన పట్టును మరొకసారి నిరూపించుకున్న తుమ్మల పోటీ ఖాయం గానే కనిపిస్తుంది.అయితే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక కాంగ్రెస్( Congress ) లేదా భాజాపాలో చేరి పోటీ చేస్తారో అన్న విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ కాంగ్రెస్లో చేరడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ,ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగానే ఉండడంతో తుమ్మల లాంటి బలమైన నాయకుడు చేరితే మరింత బలపడతామని ఆలోచనలో కాంగ్రెస్ కూడా ఉంది.
దానికి తోడు టికెట్ దక్కలేదన్న సానుభూతి కూడా కలిసి వస్తే తుమ్మల విజయం నల్లేరుపై నడకే అవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి