భార్యపై కక్ష కట్టిన భర్త.అతి కిరాతంగా, విచక్షణ రహితంగా నరికాడు.
పదునైన కత్తితో తలపై వేటు వేసి తలను మొండాన్ని వేరు చేశాడు.ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగ ప్రదేశంలో నరికి చంపేశాడు.
గమనించిన స్థానికులు అతడిని రాళ్లతో కొట్టినా పట్టించుకోకుండా కసితీరా నరికాడు.చంపేసి పోలీసులకు లొంగిపోయాడు.
భార్యను విచక్షణారహితంగా నరికిన ఘటన బీహార్ లోని బక్సర్ జిల్లలోని బ్రహ్మపూర్ లో చోటు చేసుకుంది.ప్రాంతానికి చెందిన అల్గు యాదవ్ (48)కు ఛత్తీస్ గడ్ లోని పాకుర్ జిల్లాకు చెందిన చాందినీ దేవితో వివాహం అయింది.
కొద్ది సంవత్సరాల వరకు కలిసి ఉండి, కుటుంబ కలహాల కారణంగా గత మూడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.భార్య చాందినీ ఉపాధి కోసం ఓ మాల్ లో పనిచేస్తోంది.
తన భర్త నుంచి విడాకాలు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ విషయమై వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
విడాకులు వద్దని, కలిసి బతుకుదామని అల్గు యాదవ్ చెప్పుకొచ్చాడు.అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఆమె పనిచేస్తున్న మాల్ వద్దకు వెళ్లి కత్తితో తన భార్యను కిరాతంగా నరికేశాడు.నరికిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.