40 ఫ్లోర్లు ఉన్న భారీ ట‌వ‌ర్ల‌ను కూల్చేస్తున్నారు.. ఎందుకో తెలిస్తే..

ఒక బిల్డింగ్ క‌ట్టాలంటే ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.కానీ దాన్ని కూల్చాలంటే నిముషాల్లోనే జ‌రిగిపోతుంది.

 Huge Towers With 40 Floors Are Being Demolished .. If You Know Why Huge Towers,-TeluguStop.com

క‌ట్టేందుకు ఎంతో మంది ఎన్నో సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డితే బాంబుల సాయంతో దాన్ని నిముషాల్లోనే నేల‌మ‌ట్టం చేయ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం.ఇక‌పోతే ఇలాంటి కూల్చ‌డాల‌కు సంబంధించిన వీడియోలు మ‌న‌కు నెట్టింట క‌నిపిస్తూనే ఉంటాయి.

ఇలాంటి వాటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా ఓ పెద్ద ట‌వ‌ర్ల‌ను కూల్చేందుకు రెడీ అయ్యారు.

అయితే ఒకటి కాదు రెండు కాదండోయ్‌దాదాపుగా 900 ఫ్లాట్స్ ఉన్న బిల్డింగుల‌ను కూల్చేస్తున్నారు.

మ‌న‌కు పైన ఫొటోలో క‌నిపిస్తున్న బిల్డింగ్ నేలమట్టం కావ‌డానికి రెడీ అయిపోయింది.

అయితే దీనిపై ఉన్న ఓ పాత వివాదం కార‌ణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కూల్చేయాలంటూ ఆర్డ‌ర్ వేసింది.కాగా ఇందులో రెండు బిల్డింగులు దాదాపుల‌గా 40 ఫ్లోర్ల‌తో మొత్తం 900 ప్లాట్స్ క‌లిగి ఉన్నాయి ఇవి రెండు కూడా.

ఇక ఇందులో ఉంటున్న ప్ర‌జ‌లంద‌రినీ రెండు నెలల్లో డబ్బులు చెల్లించి ఖాలీ చేయించాల‌ని, అందుకు అన్ని ఏర్పాట్లు చూడాల‌ని కోర్టు ఆదేశించింది.దీంతో పాటు ఈ బిల్డింగుల‌ను కూలగొట్టడానికి అయ్యే మొత్తం ఖర్చు కూడా క‌ట్టించిన కంపెనీయే పెట్టుకోవాలంది.

Telugu Floors, Towers, Novida, Supreme-Latest News - Telugu

అయితే దీన్ని ఎందుకు కూల్చుతున్నారో అని ఆలోచిస్తే మాత్రం దీన్ని క‌ట్టిన కంపెనీ నిర్మాణ రంగ నిబంధనలు పూర్తిగా ఉల్లింఘించింది.బిల్డింగు నిర్మించేందుకు ముందుగా ప్లాన్‌తో వెళ్లిన కంపెనీ తీరా నిర్మాణ ప‌నులు స్టార్ట్ అయిన త‌ర్వాత దాన్ని మార్చేసింది.ఇక ఇంఉలో ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా కంప్లీట్ ప్లాన్ ఇవ్వకుండా స్టార్ట్ చేసింది.ఇక రెండు పెద్ద టవర్ల మధ్యన రూల్స్ ప్ర‌కారం ఉండాల్సిన గ్యాప్ లేకుండానే క‌ట్టేసింది.

ఎలాంటి ఫైర్ సెప్టీ నిబంధ‌నలు పాటించుకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌మాద‌క‌రంగా క‌ట్టేయ‌డంతో కూల్చివేయాలంటూ కోర్టు ఆర్డ‌ర్ వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube