ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) మల్టిపుల్ సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు.బాహుబలి తర్వాత ఒక్క విజయం కూడా అందుకోలేకపోయినా ప్రభాస్ కి సాలార్ ద్వారా కాస్త రిలీఫ్ దొరికింది.
అయితే ఇదేమి బాహుబలి రేంజ్ హిట్ అయితే కాదు.కానీ ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్.
ఈ రెండు సినిమాలతో నలుగురు హీరోయిన్స్ తో ఆడి పాడుతున్నాడు.దాంతో ఈ నలుగురు భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రభాస్ పైనే ఆధారపడి ఉంది.
వరల్డ్ వైడ్ గా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ తో నటిస్తే తమ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఆలోచనలో ఉన్న ఈ నలుగురు హీరోయిన్స్ ప్రభాస్ సినిమానే దిక్కు అన్నట్టుగా ఉన్నారు.

ఇప్పటి వరకు సౌత్ లో ఒక్క హిట్ కూడా అందుకో లేకపోయిన హీరోయిన్ దిశా పటాని.( Disha Patani ) ప్రభాస్ సినిమా ద్వారా అయినా ఆ విజయాన్ని అందుకోవాలని తహతహలాడుతుంది.కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా దిశ తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
ఇక ఇదే సినిమాలో ఇప్పటి వరకు సౌత్ లో నేరుగా ఒక్క సినిమా కూడా చేయని దీపికా పదుకొనే( Deepika Padukone ) సైతం నటిస్తూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ తెలుగులో ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుంది.బాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పడుకొనే తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం నిజంగా విశేషమే కదా.

ఇక ఆఫ్ లైన్, ఆన్ లైన్ అనే తేడా లేకుండా ఎప్పుడు హాట్ ఫొటోస్ తో సందడి చేసే హీరోయిన్ మాళవిక మోహనన్( Malavika Mohanan ) కూడా ఒక్క హిట్ కావాలని ప్రభాస్ సరసన నటించి ఆ దాహాన్ని తీసుకోవాలని ఎంతో ఉత్సాహపడుతోంది.ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ తో కలిసి రాజా సాబ్( Rajasaab ) సినిమాలో నటిస్తుంది. ఇదే సినిమాలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన సరైన విజయం లేని నిధి అగర్వాల్( Nidhi Aggarwal ) సైతం నటిస్తుంది.ప్రభాస్ సినిమా ద్వారానే తనకంటూ ఒక విజయం దొరుకుతుందని ఆశపడుతుంది.
రాజా సాబ్ సినిమా ద్వారా ఈ ఇద్దరు హీరోయిన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ జాతకాలు మారిపోతాయని భావిస్తున్నారు.మరి ఏ మేరకు వీరి జాతకాలు మారుతాయో ఈ సినిమాలు విడుదల విడుదల అయితే కానీ తెలియదు.
ఇలా ఈ నలుగురు స్టార్ హీరోయిన్స్ ప్రభాస్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.