అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

అబ్బాస్.ఈ పేరు వినగానే మన హీరోనే అని అనిపిస్తుంది కదా! అవును మన హీరోనే కానీ ఎక్కువ సినిమాలు చెయ్యలేదు.

 Hero Abbas Real Life News, Prema Desham, Abbas, Harpic Ad, Abbas Movies, Movie O-TeluguStop.com

చేసినవి కొన్ని సినిమాలు అయినా సరే మంచి హిట్ కొట్టాయి.అందుకే ఈయన అంటే తెలియని వారు ఉండరు.

ఎందుకంటే ఈయన చేసిన సినిమాలు తక్కువ అయినా హిట్ అయ్యాయి.ఇంకా ఆ సినిమాలతో పాటు అబ్బాస్ ఒక యాడ్ లో కూడా చేశాడు.

అది ఇప్పటికి టీవిలో వస్తూనే ఉంటుంది.
అదే హార్పిక్ యాడ్.

టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి అబ్బాస్ పేరు సుపరిచితమే.ఎన్నో రకాల హార్పిక్ యాడ్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ హీరో.1996 సమయంలో అబ్బాస్ పేరు మారుమోగిపోయింది.ఎందుకంటే ప్రేమదేశం అంటూ టబుతో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అప్పట్లో వచ్చిన సినిమా అంత అద్భుతంగా ఉంది.ప్రేముకులందరికీ నచ్చిన సినిమా ఇది.స్నేహితులు అంత మెచ్చిన సినిమా.
ఇక ఆ సినిమా తర్వాత ఎందరో అబ్బాస్ కు ఫ్యాన్స్ అయ్యారు.

అయితే ఆ సినిమా చూసిన వారంతా కూడా అబ్బాస్ హెయిర్ స్టైల్ కి వీర ఫ్యాన్స్ అయ్యారు.ఆతర్వాత తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అబ్బాస్.2014 లో ఆలా జరిగింది ఒక రోజు అనే చిత్రం చివరి తెలుగు సినిమా.ఇక ఆతర్వాత సినిమాల్లో కనిపించలేదు.

తమిళ్ రెండు సీరియల్స్ లో నటించి అబ్బాస్ 2016లో ఒక మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.ప్రస్తుతం అయన సినీ జీవితానికి దూరంగా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు.

ఏది ఏమైనా అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో మంచి ట్రెండ్ సెట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube