వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకునే ప్లాట్‌ఫామ్స్‌ ఇవే!

కొవిన్‌ యాప్‌లో కొవిడ్‌ యాప్‌ బుక్‌ చేసుకుంటున్నాం.కేవలం ఈ యాప్‌లోనే కాకుండా.

 Here Is The List Of Vaccine Booking Apps, Corona Vaccine, Airtel, Civin App, Pay-TeluguStop.com

ఇతర ప్లాట్‌ఫాంలు ద్వారా కూడా వ్యాక్సిన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.

పేటీఎం.పేటీఎం పేమెంట్స్‌ యాప్‌ ద్వారా కూడా వ్యాక్సిన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది.ఈ పేమెంట్‌ యాప్‌ హోం స్క్రీన్‌లోనే వ్యాక్సిన్‌ ఫైండర్‌ ఉంటుంది.దాన్ని ఎంపిక చేసుకుని మీ ఏరియా పిన్‌కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

దీంతోపాటు మీ వయస్సు కూడా నమోదు చేయాలి.మీ వివరాలు నమోదు చేసిన తర్వాత మీకు అందుబాటులో ఉన్న స్లాట్‌ డేట్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఆ తర్వాత ‘బుక్‌ నౌ’ బటన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.అప్పుడు మీకు ఓ కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

అందులో మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్‌ సెంటర్‌ల వివరాలు ఉంటాయి.మీ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

అప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

ఏకా కేర్‌ యాప్‌.

ఏకా కేర్‌ యాప్‌ ద్వారా కూడా మీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ ఫొన్లతోపాటు ఐఓఎస్‌ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత హోం పేజీలో ఉన్న ‘చెక్‌ వ్యాక్సిన్‌ అవైలబిలిటీ కార్డ్‌’ను క్లిక్‌ చేయాలి.

ఈ యాప్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటే, దీనిలో కూడా మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu Coronavaccine, Airtel, Cowin App, Paytm App-Latest News - Telugu

హెల్తీఫై మీ.ఈ హెల్త్‌ టెక్‌ స్టార్టప్‌ ద్వారా కూడా వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం ఉంది.ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత వ్యాక్సినేట్‌ మీ’ పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మీ ఏరియా పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేయాలి.మీ వివరాలను నమోదు చేయాలి.

అప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ తేదీలను చూపిస్తుంది.మీరు స్లాట్‌ బుక్‌ చే సుకున్న తర్వాత బుక్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

కన్‌ఫం పై క్లిక్‌ చేస్తే మీ బుకింగ్‌ పూర్తవుతుంది.

రిలయన్స్‌ మైజియో.

మై జియో యాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేయాలనుకుంటే.జియో మొబైల్‌ నంబర్‌ ద్వారా యాప్‌ లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

హోం స్క్రీన్‌లో కింది వైపునకు స్క్రోల్‌ చేస్తే.‘ కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ ఫైండర్‌’ కనిపిస్తుంది.

దానిపై క్లిక్‌ చేసి, పిన్‌కోడ్, ఇతర వివారలను నమోదు చేయాలి.అప్పుడు కొవిన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.

అక్కడ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Telugu Coronavaccine, Airtel, Cowin App, Paytm App-Latest News - Telugu

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌.జియో మాదిరిగానే యాప్‌లోని ‘వ్యాక్సిన్‌ ఫైండర్‌’లో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.‘చెక్‌ అవైలబిలిటీ’పై క్లిక్‌ చేస్తే మీకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్‌ల వివరాలు కనిపిస్తాయి.

అక్కడ మీరు వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube