ఏపీ హైకోర్టులో( AP High Court ) టీడీపీ నేత గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) పిటిషన్ పై విచారణ జరిగింది.తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గంటా పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై( Petition ) విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2022లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.దీనికి దాదాపు మూడు సంవత్సరాలు తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) ఆమోదం తెలిపారు.ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై రాజకీయ కోణం ఉందని గంటా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.