మచిలీపట్నం( Machilipatnam ) పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్( Simhadri Ramesh Babu ) పేరు ఖరారైంది.అవనిగడ్డ( Avanigadda )లో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ ప్రకటించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధినేత, సీఎం జగన్ తనను మచిలీపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పారని సింహాద్రి రమేశ్( Simhadri Ramesh ) తెలిపారు. జగన్( YS jagan ) ఏది చెప్తే అదే చేస్తానన్న ఆయన చివరి వరకూ జగన్ వెంటనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.అయితే ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బందరు పార్లమెంట్ సభ్యునిగా వెళ్తే మోపిదేవి వెంకటరమణ అవనిగడ్డ స్థానం నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.