ఏపీ హైకోర్టులో గంటా శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ..!

ఏపీ హైకోర్టులో( AP High Court ) టీడీపీ నేత గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) పిటిషన్ పై విచారణ జరిగింది.

తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గంటా పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై( Petition ) విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. """/" / అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2022లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దీనికి దాదాపు మూడు సంవత్సరాలు తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) ఆమోదం తెలిపారు.

ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై రాజకీయ కోణం ఉందని గంటా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.

జైల్లో అడుగుపెట్టిన భారత సంతతి నేత ఈశ్వరన్.. ఖైదీగా అధికారులు ఏమిచ్చారంటే?