వైరల్: విద్యార్థుల కోసం ఆ ప్రధానోపాధ్యాయుడు కత్తెర తీసుకొని.. ఏకంగా..?!

గిరిజన గురుకుల పాఠశాలల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన పిల్లలు చదువుకుంటారు.వారికి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో పరిశీలించేందుకు అధికారులు కూడా అంతగా రారు.

 Headmaster Hair Cut To Students In Alluri Sitharamaraju District Details, Viral-TeluguStop.com

ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో అని టెన్షన్ వారి తల్లిదండ్రుల్లో ఉంటుంది.విద్యార్థులను( Students ) మాత్రం కొంత మంది ఉపాధ్యాయులు సొంత పిల్లల్లా చూసుకుంటారు.

వారికి పాఠ్యాంశాలు చెప్పి, తమ పని అయిపోయిందని వారు చేతులు దులుపుకోరు.పిల్లల బాగోగులను చాలా శ్రద్ధగా పట్టించుకుంటారు.

సొంత పిల్లల్లా భావించి వారికి అవసరమైన సౌకర్యాలు సమకూర్చుతారు.

అందుకు అవసరమైతే తమ వ్యక్తిగత డబ్బులతో పాటు విలువైన సమయాన్ని కూడా వెచ్చిస్తారు.

ఇలాంటి ఓ ఉపాధ్యాయుడు( Teacher ) ప్రస్తుతం అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.పిల్లలకు బోధనతో పాటు క్రమశిక్షణ ( Discipline ) నేర్పిస్తున్నారు.మంచి చెడు పట్టించుకుంటూ వారిని సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు.ఆ వ్యక్తి గురించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

ఏపీలోని అల్లూరి జిల్లా( Alluri District ) హుకుంపేటలో గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల( Tribal Welfare School ) ఉంది.మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాల ఇది.ఇక్కడ భారీ సంఖ్యలో గిరిజన చిన్నారులు చదువుకుంటున్నారు.

Telugu Discipline, Headmaster, Hukumpet, Latest, Principal, Scissors, Tribalwelf

అయితే వారికి విద్యాబోధనతో పాటు క్రమశిక్షణను సైతం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాజీ( Headmaster Balaji ) నేర్పిస్తున్నారు.వారికి హెయిర్‌కట్( Hair Cut ) చేసేందుకు ఇటీవల బార్బర్ రాలేదు.దీంతో చిన్నారుల జుట్టు భారీగా పెరిగిపోయింది.

చదువుకునే పిల్లలకు ఇలా జుట్టు పెరగడం సరికాదని బాలాజీ భావించారు.తానే స్వయంగా కత్తెర, దువ్వెన పట్టుకుని విద్యార్థులకు హెయిర్‌కట్ చేశారు.

విద్యార్థుల సమ్మతితో వారికి ఇబ్బంది లేకుండా హెయిర్‌కట్ పూర్తి చేశారు.

Telugu Discipline, Headmaster, Hukumpet, Latest, Principal, Scissors, Tribalwelf

క్రమశిక్షణతో కూడిన విద్య వల్లే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని బాలాజీ చెబుతున్నారు.ఇక ఆయన ఈ చిన్నారులను తన సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు.బోధనలో నిమగ్నమై ఖాళీ సమయం దొరికితే చాలా మంది ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకుంటారు.

అయితే బాలాజీ మాత్రం తనకు ఏదైనా ఖాళీ సమయం ఉంటే విద్యార్థుల బాగు కోసం ఏదైనా పని చేయాలని తపిస్తుంటారు.ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పిల్లలను బాలాజీ చూసుకుంటున్న తీరును ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube