ఓ మహిళ వివాహ సంబంధం కంటే వివాహేతర సంబంధానికే అధిక ప్రాధాన్యం ఇచ్చి, ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చిన ఘటన నందిగామలోని వీరులపాడు గ్రామంలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
ఏసీపీ కె.జనార్ధన్ నాయుడు( ACP K.Janardhan Naidu ) తెలిపిన వివరాల ప్రకారం.వీరులపాడు గ్రామానికి చెందిన యాదవ శ్రీనివాసరావు( Yadava Srinivasa Rao ) (58) పాస్టర్ గా జీవిస్తున్నాడు.
ఇతనికి భార్య వాణి తో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.శ్రీనివాసరావు సోమవారం ఉదయం వేరే గ్రామానికి వెళ్లి రాత్రి సుమారుగా 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు.
అయితే శ్రీనివాసరావు ఇంటి తలుపులు తీయగా భార్య వాణి( vani ) వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి కోపంతో భార్యపై చేయి చేసుకున్నాడు.ఈ దంపతుల మధ్య చిన్నగా గొడవ పెరగడం మొదలైంది.
వాణి తో పాటు ఆమె ప్రియుడు ఒక కేబుల్ వైర్ తో శ్రీనివాసరావు మెడకు గట్టిగా బిగించి ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేశారు.శ్రీవాసరావు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాణి ప్రియుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో తన భర్త చనిపోయారని చుట్టుపక్కల ఉండే వారికి తెలిపింది.తన భర్త ఎలా చనిపోయాడు తనకు తెలియదని, తామిద్దరం వేర్వేరు గదుల్లో నిద్రించామని, ఉదయం భర్త ఎంతసేపటికి నిద్ర ఇవ్వకపోవడంతో దగ్గరకు వెళ్లి చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడని చుట్టుపక్కల ఉండే వారందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే వాణి మాటలపై అనుమానం కలగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఏసీపీ కె.జనార్ధన్ నాయుడు, నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్( CI Nagendra Kumar ) , కంచికచర్ల ఎస్సై సుబ్రహ్మణ్యం, వీరులపాడు ఎస్సై మహాలక్ష్ముడు సంఘటన స్థలానికి చేరుకుని శ్రీనివాసరావు మృతదేహాన్ని పరిశీలించగా.గొంతు వద్ద వైర్ బిగించి ఊపిరి ఆడనీయకుండా చేసినట్లు ఆనావాళ్లు కనిపించాయి.
పోలీసులు కేసు నమోదు చేసుకుని వాణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.







