వారి రాకతో కే‌సి‌ఆర్ అలెర్ట్ అయ్యరా ?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.

 Has Kcr Been Alerted? Cm Kcr, Amit Shah, Bjp Party, Congress Party, Priyanka Gan-TeluguStop.com

వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు గట్టి పట్టుదలగా ఉన్నాయి.

అందుకే రెండు పార్టీల జాతీయ నేతలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణపైనే దృష్టి పెట్టారు.తరచూ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీలలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు.

ఈ నెల 30న కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )తెలంగాణకు రానున్నారు.

Telugu Amit Shah, Bjp, Congress, Priyanka Gandhi, Ts-Politics

దీంతో ఇప్పటికే టి కాంగ్రెస్ నేతలు ఆమె రాకకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ టూర్ లో ప్రియాంకా గాంధీ పలు డిక్లరేషన్స్ ను ప్రకటించడంతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొంత మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పనున్నారు.ఇదిలా ఉంచితే ప్రియాంకా గాంధీ రాకకు ఒకరోజు ముందు అనగా 29న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా( Amit Shah ) తెలంగాణ కు రానున్నారు.

బి‌ఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Telugu Amit Shah, Bjp, Congress, Priyanka Gandhi, Ts-Politics

అలాగే కొత్తగా వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా వారికి ప్రత్యేక సూచనలు చేయనున్నారు.అయితే వరుసగా రెండు రోజుల్లో ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు రాష్ట్రపర్యటన చేస్తుండడంతో బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.పార్టీ ఫిరాయింపుల నేతలను ఒక కంట కనిపెడుతున్నట్లు టాక్.

బి‌ఆర్‌ఎస్( BRS party ) నుంచి కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చెబుతున్నా నేపథ్యంలో.కే‌సి‌ఆర్ దృష్టంతా పార్టీ ఫిరాయింపు నేతలపైనే ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి కే‌సి‌ఆర్ ను గద్దె దించేందుకు బీజేపీ, కాంగ్రెస్ గట్టి ప్రయత్నలే చేస్తోంది.మరి ఈ రెండు పార్టీలను కే‌సి‌ఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube