హర్యానాలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా ఉండేలా కనిపిస్తున్నాయి .ముఖ్యంగా అధికార పార్టీ బిజెపికి ఈ ఎన్నికలు టెన్షన్ కలిగిస్తోంది .
దీనికి కారణం గత ఐదేళ్లుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా.వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు వెళ్లడంతో ఇప్పుడు ఆ ప్రభావం స్పష్టంగా కనిపించబోతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు అక్కడ బిజెపి( BJP ) ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతులు, అందులోను జాట్లు ఇప్పుడు ఓటు ద్వారా గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా బిజెపి కూడా అంచనా వేస్తోంది. హర్యానాలో 37 స్థానాల్లో పరిస్థితులు మారిపోతున్నాయట.
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ( ఐ ఎన్ ఎల్ డి ), జన్ నాయక్ జనతా పార్టీ ( జేజేపి ) కూడా అనేక చోట్ల ప్రభావం చూపించబోతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హర్యానాలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ఇందులో 37 సీట్లలో జాట్లదే హవా .అలాగే జాట్లు గత కొంతకాలంగా బిజెపి పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .దీనికి కారణం కేంద్రం తెచ్చిన అగ్ని పథ్., రైతుల ఆందోళనను కేంద్రం అడ్డుకుంటున్న తీరు , రైతులకు వ్యతిరేకంగా బిజెపి వ్యవహరిస్తున్న తీరు , ఇవన్నీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించేలా కనిపిస్తున్నాయి.హర్యానా జనాభాలో 27% జాట్లు ఉన్నారు.వీరు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారట.మనోహర్ లాల్ కట్టర్( Manohar Lal Khattar ) ను సీఎంగా తప్పించి నాయక్ సైనికి సీఎం కుర్చీ అప్పగించాక … అప్పటికే జాట్లలో బిజెపిపై ఉన్న ఆగ్రహం మరింతగా పెరిగింది .
దీనికి తోడు ఒలంపిక్ రెజ్లర్ దినేష్ పోగట్( Vinesh Phogat ) ను కాంగ్రెస్( Congress ) తమ పార్టీలో చేర్చుకుంది.ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించబోతోంది.పోగాట్ కు జాట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్.
ఓట్లు వేయించే సామర్థ్యం ఉండడం బిజెపిని జాట్లు వ్యతిరేకిస్తున్న క్రమంలో ఈ ఎన్నికలపై బీజేపీ మరింతగా టెన్షన్ పడుతోంది.