అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా పేరొందిన హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన క్రిమ్సన్ పత్రికకు ఒక నల్ల జాతీయురాలు అధ్యక్షా హోదాలో పదవిని అలంకరించ నుంది.దాదాపు 145 ఏళ్ల చరిత్ర గల ఈ పత్రికకు వర్సిటీలోని లిబరల్ ఆర్ట్స్ విద్యార్థిని అయిన క్రిస్టినీ గుయిలామె అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టనుంది.
అయితే రానున్న కొత్త ఏడాది జనవరి నుంచీ ఆమె ఈ భాద్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.20 ఏళ్ల క్రిస్టినీ ప్రస్తుతం ఆమె సాహిత్యం, చరిత్ర, ఆఫ్రికన్-అమెరికన్ స్టడీస్ చదువుతోంది.న్యూయార్క్ కి చెందిన క్రిస్టినీ తల్లిదండ్రులు వలసదారులు.ఇప్పటివరకూ ఇద్దరు నల్లజాతీయులు క్రిమ్స్‌కు అధ్యక్షురాలుగా వ్యవహరించారు.
ఇదిలాఉంటే గతంలో మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా 1990లో ఈ పత్రికకు అధ్యక్షుడిగా ఎంపికవగా అప్పట్లో ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయుడు ఆయనే కావడం విశేషం.గతంలో ఈ పత్రికలో రచయిత.ఎడిటర్‌గా పనిచేసిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ.ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ కూడా ఉన్నారు.