హెచ్ -4 రద్దు వద్దు..ట్రంప్ కి లేఖలు

అమెరికాలో ట్రంప్ ప్రవేశ పెడుతున్న వీసా నిభందనలు భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.ముఖ్యంగా తాజాగా హెచ్ -4 రద్దు వ్యవహారం ఎంతో మంది మహిళా ఉద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేస్తాయి

 H4 Visa Reconsider Decision On H 4 Visas Us Lawmakers Asks To Trump-TeluguStop.com

ఈ కారణంగా మహిళలకి భద్రతా కలిపించే విధంగా వీసా రద్దు పై మరో మారు ఆలోచించాలని ఎంతో మంది మహిళా ఎన్నారైలు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడే పరిస్థితి వస్తుందని వర్క్‌ పర్మిట్‌ రద్దుపై ఇద్దరుమహిళా సెసేటర్లు స్పందించారు.

ఈ వీసాలను రద్దు మహిళల కుటుంభాలు నష్టపోతాయని డెమోక్రటిక్‌ పార్టీ కాలిఫోర్నియా సెనేటర్‌, తొలి భారతీయ అమెరికన్‌ మహిళ కమలా హారిస్‌, న్యూయార్క్‌ సెనేటర్‌ కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్ ట్రంప్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.హెచ్‌-4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను రద్దు చేస్తే లక్షమంది మహిళలపై ప్రభావం చూపుతుందని, వీరిలో భారతీయ-అమెరికన్లు ఉన్నారని తెలిపారు.హెచ్‌-4 వీసాపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అటు వృత్తిపరంగానే కాకుండా కుటుంబపరంగానూ కష్టాలు ఎదుర్కొంటారని తన లేఖలో పేర్కొన్నారు.

ఈ వీసా రద్దు విషయంలో వచ్చే మూడు నెలలో ఒక నోటిఫికేషన్‌ విడుదల చేయనునున్నామని అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది…హెచ్-4 వీసాలను రద్దు అమల్లోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది భారతీయులే.అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములు ఇక అమెరికాలో ఎక్కడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు.అలాగే హెచ్-4 వీసాలపై అమెరికా వెళ్లాలనుకొన్నవారికీ నిరాశ తప్పదు…మరి ట్రంప్ అమెరికా మహిళా సెనేటర్స్ మాటలు పట్టించుకుంటాడో లేదో వేచి చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube