హెచ్ -4 రద్దు వద్దు..ట్రంప్ కి లేఖలు

అమెరికాలో ట్రంప్ ప్రవేశ పెడుతున్న వీసా నిభందనలు భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ముఖ్యంగా తాజాగా హెచ్ -4 రద్దు వ్యవహారం ఎంతో మంది మహిళా ఉద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేస్తాయి Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ కారణంగా మహిళలకి భద్రతా కలిపించే విధంగా వీసా రద్దు పై మరో మారు ఆలోచించాలని ఎంతో మంది మహిళా ఎన్నారైలు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడే పరిస్థితి వస్తుందని వర్క్‌ పర్మిట్‌ రద్దుపై ఇద్దరుమహిళా సెసేటర్లు స్పందించారు.

ఈ వీసాలను రద్దు మహిళల కుటుంభాలు నష్టపోతాయని డెమోక్రటిక్‌ పార్టీ కాలిఫోర్నియా సెనేటర్‌, తొలి భారతీయ అమెరికన్‌ మహిళ కమలా హారిస్‌, న్యూయార్క్‌ సెనేటర్‌ కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్ ట్రంప్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.

హెచ్‌-4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను రద్దు చేస్తే లక్షమంది మహిళలపై ప్రభావం చూపుతుందని, వీరిలో భారతీయ-అమెరికన్లు ఉన్నారని తెలిపారు.

హెచ్‌-4 వీసాపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అటు వృత్తిపరంగానే కాకుండా కుటుంబపరంగానూ కష్టాలు ఎదుర్కొంటారని తన లేఖలో పేర్కొన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ వీసా రద్దు విషయంలో వచ్చే మూడు నెలలో ఒక నోటిఫికేషన్‌ విడుదల చేయనునున్నామని అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.

హెచ్-4 వీసాలను రద్దు అమల్లోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది భారతీయులే.అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములు ఇక అమెరికాలో ఎక్కడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు.

అలాగే హెచ్-4 వీసాలపై అమెరికా వెళ్లాలనుకొన్నవారికీ నిరాశ తప్పదు.మరి ట్రంప్ అమెరికా మహిళా సెనేటర్స్ మాటలు పట్టించుకుంటాడో లేదో వేచి చూడాలి .

బాలయ్యకు పద్మభూషణ్…. శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్?