భారత్ జవాన్ లను ప్రశంసించిన గవర్నర్ తమిళసై..!!

భారత్ చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దు దాటాలని 300 మంది చైనా సైనికులు మరణ ఆయుధాలతో.

 Governor Tamilisai Praised Bharat Jawan, Governor Tamilisai, Indian Army,bharat-TeluguStop.com

ప్రయత్నాలు చేయగా 100 మంది భారత సైనికులు తరిమికొట్టారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతోంది.

ఇక ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలలో చైనా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలియజేశారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై దేశ సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు భారత్ సైనికులు తరిమి కొట్టడాన్ని ప్రశంసించారు.

భారత్ సైనికుల సాహసాలు, సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు.సమాజంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే సరిహద్దుల వద్ద సైనికులు చేస్తున్న త్యాగాలే అందుకు ముఖ్య కారణం అని అన్నారు.

సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సమయంలో తమిళసై ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube