గోపీచంద్‌ కెరీర్‌ లో ఇది కీలకం.. మళ్లీ పాత రోజులే!

హీరోగా గోపీచంద్‌ కెరీర్‌ మొదలు పెట్టాడు.మొదటి సినిమా తోనే నిరాశ పర్చడంతో మళ్లీ సినిమా లను చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

 Gopichand And Maruthi Movie Pakka Commercial Movie Inside Talk , Director Marut-TeluguStop.com

ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విలన్ గా కనిపించాడు.నిజం మరియు వర్షం వంటి సినిమా ల్లో గోపీచంద్‌ విలనిజంను ఏ రేంజ్ లో చూపించాడో తెలుగు ప్రేక్షకులకు తెల్సిందే.

మళ్లీ హీరోగా నిలదొక్కుకునేందుకు ఆ సినిమాలు చాలా దోహద పడ్డాయి.ఇండస్ట్రీలో గోపీచంద్‌ ను హీరోగా నిలిపిన చిత్రం యజ్ఞం.

ఆ తర్వాత చాలా సినిమా లు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కొన్ని సినిమాలు ప్లాప్‌ అయినా కూడా ఇండస్ట్రీలో గోపీచంద్‌ కు మంచి పేరు ఏర్పడింది.

ప్రేక్షకులు మరియు అభిమానులు గోపీచంద్ నుండి ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా మంచి సినిమాలు వస్తాయి అంటూ ఎదురు చూస్తున్నారు.తాజాగా ఆయన హీరోగా పక్కా కమర్షియల్‌ అనే సినిమా రూపొందింది.

మారుతి దర్శకత్వం లో ఈ సినిమా ను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమకు సంబధించిన విడుదల తేదీ దగ్గర పడుతుంది.

ఈ సమయంలో యూనిట్‌ సభ్యులు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా పై చాలా అంచనాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

మారుతి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మెజార్టీ సినిమా లు పక్కా కమర్షియల్‌ అన్నట్లుగా నిలిచాయి.అందుకే ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటున్నారు.

ఒక వేళ ఈ సినిమా కనుక ప్లాప్‌ అయితే గోపీచంద్‌ పాత రోజుల్లో మాదిరిగా విలన్‌ వేశాలు వేసుకోవాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గోపీచంద్‌ కు విజయం అనేది దక్కక చాలా ఏళ్లు అయ్యింది.

కనుక ఈ సమయంలో ఆయన ఇంకా కెరీర్ ను కొనసాగించడం అనేది అసాధ్యం అంటున్నారు.గోపీచంద్‌ మాత్రం పక్కా కమర్షియల్‌ పక్కా హిట్‌ అన్నట్లుగా ఎదురు చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube