ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మొదలైన రైళ్ల సందడి.. !

దేశంలో కరోనా కాస్త తగ్గుముఖ పడుతుందని అధికారులు వెల్లడించిన క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న లాక్‌డౌన్ వేళల్లో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో రవాణా వ్యవస్దలో ఇప్పుడిపుడే మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 Good News For Ap Railway Passengers, Ap, Railway Passengers, Good News, Special-TeluguStop.com

కోవిడ్ వల్ల ఆగిపోయిన బస్సులు, రైళ్లు మళ్లీ కూతకు సిద్దం అవుతున్నాయి.ఈ క్రమంలో ఏపీ వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

కొన్ని ప్రత్యేక రైళ్లను ఈ నెల 30వ తేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఆ వివరాలు చూస్తే.

షాలిమార్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు 02449-02450.జూన్ 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌ లో మధ్యాహ్నం 12.20 కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55 కి సికింద్రాబాద్‌ కు చేరుకుంటుందని, ఇదే రైలు తిరిగి జూన్ 11, 18, 25, జులై 2వ తేదీల్లో సికింద్రాబాద్‌ లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుకుంటుందని తెలిపారు.ఇక పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్ 03253-03254.

ఈరోజు నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు.ఇకపోతే హౌరా-యశ్వంత్‌ పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు 02469-02470 జూన్ 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌ పూర్‌ కు చేరుకోగా, జూన్ 13, 20, 27వ తేదీల్లో ఉదయం 5.15 కి యశ్వంత్‌ పూర్‌ లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 కి హౌరాకు చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube