టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి సీట్ల పంపకాలు చేసుకున్నాయి.నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
అయితే ఇంకా కొన్ని స్థానాల విషయంలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి.ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు.
ఇక్కడ బిజెపి తమ అభ్యర్థిగా శివరామకృష్ణం రాజును ప్రకటించింది.ఆయన జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టిడిపి నేత నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి( Nallimilli Rama Krishna Reddy ) గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.అయితే పొత్తులో భాగంగా బిజెపికి ఇక్కడ టికెట్ కేటాయించినా, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తాను టిడిపి రెబల్ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానంటూ ప్రకటించడం కలకలం రేపింది.

అయితే రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని గత కొద్ది రోజులుగా ఒప్పించే ప్రయత్నం చేసారు.అయినా ఈ సీటు విషయంలో సందిగ్ధం నెలకొంది.తాజాగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపి( BJP )లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసే విధంగా ఒప్పించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణంరాజును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి బుజ్జగించారు.
ఇక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే విధంగా టిడిపి అధినేత చంద్రబాబు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు బిజెపి నేతలతో చర్చించి రామకృష్ణారెడ్డిని ఒప్పించారు.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తారని బుచ్చయ్య చౌదరి ప్రకటించారు.కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తారని బుచ్చయ్య చౌదరి క్లారిటీ ఇచ్చారు.ఇక చంద్రబాబు మాట శిరోధార్యం అంటూ త్వరలో బిజెపిలో చేరేందుకు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సిద్ధమవుతున్నారు.
దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడబోతోంది .అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణంరాజు పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.