టైర్ 2 హీరోల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని(Nani) పాన్ ఇండియన్ వ్యాప్తంగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ”దసరా” (Dasara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకుంది.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కార్మికుల జీవితం ఆధారంగా యువ డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్(Keerthy suresh) హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె కూడా డీ గ్లామర్ లుక్ లోనే కనిపిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ లో కీర్తి కూడా తన లుక్ తో ఆకట్టుకుంది.ఇక ఆది పినిశెట్టి కూడా కీలక రోల్ చేస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ కు చేరుకున్నాయి అనే చెప్పాలి.
నాని కూడా ఎప్పుడు లేని విధంగా మాస్ లుక్ లోకి మారిపోయి అదరగొడుతున్నాడు.
ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా స్నేహం, ఎమోషనల్, ప్రేమ అనే మూడు అంశాలను హైలెట్ చేస్తూ డైరెక్టర్ తెరకెక్కించాడట.
ఈ మూడు అంశాలే ఈ సినిమాకు హైలెట్ అని తాజాగా టాలీవుడ్ వర్గాల్లో సమాచారం అందుతుంది.శ్రీకాంత్ ఓదెల నాని క్యారెక్టర్ ను ఈ సినిమాలో అదిరిపోయే విధంగా తెరకెక్కించాడు అని.నాని, కీర్తిల మధ్య యాక్టింగ్ ఆడియెన్స్ హృదయాలను హత్తుకుంటుంది అని అంటున్నారు.మొత్తంగా నాని కెరీర్ కు దసరా మూవీ సరికొత్త బూస్ట్ అనే చెప్పాలి.