తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.మార్క్ ఫెడ్ ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ మరోసారి రైతులను రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు.రైతు వేదికలు బీఆర్ఎస్ నేతల తాగుబోతు సెంటర్లుగా మారాయని విమర్శించారు.కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే క్వింటాల్ ధాన్యానికి రూ.200 బోనస్ ఇవ్వాలని తెలిపారు.చింతమడకకు వెళ్దామా.? 24 గంటల ఉచిత విద్యుత్ లేదని నిరూపిస్తామని సవాల్ విసిరారు.