ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి.స్టూడెంట్స్ కి పరీక్షల ఒత్తిడి.
యువతకి జాబ్ వేటలో ఒత్తిడి, దంపతులకి సంసారంలో ఒత్తిడి, తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో ఒత్తిడి.ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరం ఒత్తిడిని అనుభవిస్తున్నాం.
బయటకి కనిపించకున్నా, ఈ ఒత్తిడి మన ఆరోగ్యానికి ఏంతో కీడు చేస్తోంది.ఈ ఒత్తిడిని జయించాలంటే, యోగా, వ్యాయామం, ధ్యానంతో పాటు సరైన ఆహారం కూడా తీసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించడానికి పనికొచ్చే ఆహారమేంటో ఇప్పుడు చూద్దాం.
* నట్స్ :
నట్స్ లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువుంటాయి.ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.మానసికంగా, శారీరకంగా ధృడంగా మారుస్తాయి.ఉద్యోగం చేస్తున్నవారు, విద్యార్థులు, ఎలాంటి పనిఒత్తిడి ఉన్నవారైనా ఎప్పుడూ నట్స్ దగ్గర పెట్టుకుంటే మంచిది.
* విటమిన్ – సి :
ఒత్తిడిని జయించడంలో విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది.అనాస, నారింజ, జామపండు, టొమాటో లాంటి ఫలాల్లో విటమిన్ సి బాగా దొరుకుతుంది.
* అరటిపండు :
అరటిపండు వలన మెదడులో సెరటోనిన్ అనే రసాయనం ఉత్పన్నం అవుతుంది.ఇది మెదడుని ఉత్తేజపరుస్తుంది.ఒత్తిడిని తగ్గించి అలోచించే శక్తిని పెంచుతుంది.
* చేప నూనే :
ఒత్తిడితో ఇబ్బంది పడేవారు మామూలు నూనేకి బదులు చేపనూనే వాడితే మంచిది.మరీ ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఈ పద్ధతి పాటిస్తే లాభకారం.