ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.2024 ఎన్నికలను ఏపీలో ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అవుతూ ఉంది.మరోపక్క తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో.అభ్యర్థుల విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో వైసీపీ పార్టీ నేత మాజీ మంత్రి MLA బాలినేని శ్రీనివాస్ రెడ్డి( MLA Balineni Srinivas Reddy ).ఒంగోలులో కాకుండా వేరే చోట పోటీ చేస్తున్నట్లు.ఏపీ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన బాలినేని.కావాలని విపక్షాలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.నా మీద నా కుమారుడు మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు.
ఈసారి రాజకీయాలు చూస్తుంటే చాలా చిరాకు కలిగిస్తున్నాయి.వచ్చే ఎన్నికలలో ఓ కులానికి చెందిన వాళ్లు రోడ్డు మీదకు వచ్చి తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) కోసం పని చేస్తారు.
అయితే మన కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా కలిసి పని చేస్తానంటేనే పోటీలో ఉంటా అని బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీ చేస్తా.
మరో నియోజకవర్గానికి వెళ్ళాను.అంతేకాదు ఒంగోలులో 25వేల మందికి వెళ్ళ పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని.
జగన్ కి తెలియజేసినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.