జపాన్ టాయిలెట్లు వాటంతట అవే మూసుకుంటాయి, తెరచుకుంటాయి.ఎవరైనా గదిలోకి రాగానే.
ఆటోమేటిక్‌గా తెరచుకుంటాయి.ఇందుకోసం రెండు బటన్లు ఉంటాయి.
కొద్దిగానే ఫ్లష్ చెయ్యాలంటే ఒకటి, ఎక్కువ నీటిని ఫ్లష్ చెయ్యాలంటే మరో బటన్ ఉంటుంది.సహజంగా ఇవి మహిళలకు ఉపయోగపడతాయి.
సుచి, శుభ్రతకు పెట్టింది పేరు జపనీయులు.ప్రతీదీ శుభ్రంగా ఉండకపోతే వారికి నచ్చదు.చాలా తక్కువ భూభాగం ఉండే జపనీయులు ఉన్న కాస్త ప్రదేశాన్నీ అందంగా తీర్చిదిద్దుకుంటారు.పెద్ద చెట్లను పెంచేందుకు ప్లేస్ లేకపోవడం వల్లే వాళ్లు బోన్సాయ్ మొక్కల్ని పెంచుతారు.
ఇక అక్కడ ఇళ్లలోనే కాదు.బయట ఉండే పబ్లిక్ టాయిలెట్లు కూడా తళతళా మెరుస్తూ ఉంటాయి.
అలా లేకపోతే వాళ్లు భరించలేరు.అలాంటి ఓ టాయిలెట్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మరి అక్కడి టాయిలెట్లలో ఉండే 5 ప్రత్యేక ఫీచర్లు తెలుసుకుందాం.
జపాన్ టాయిలెట్లు వాటంతట అవే మూసుకుంటాయి, తెరచుకుంటాయి.
ఎవరైనా గదిలోకి రాగానే.ఆటోమేటిక్‌గా తెరచుకుంటాయి.
వెళ్లిపోతే మూసుకుంటాయి.ఈ టాయిలెట్లలో నీటిని ఆదా చేసే టెక్నాలజీ ఉంది.
ఇందుకోసం రెండు బటన్లు ఉంటాయి.కొద్దిగానే ఫ్లష్ చెయ్యాలంటే ఒకటి, ఎక్కువ నీటిని ఫ్లష్ చెయ్యాలంటే మరో బటన్ ఉంటుంది.
కొంతమంది టాయిలెట్‌కి వెళ్తే… అపానవాయువు వల్ల రకరకాల సౌండ్లు వస్తాయి.అవి ఇతరులకు వినిపించకుండా ఉండేందుకు జపనీస్ టాయిలెట్లలో ప్రత్యేక బటన్ ఉంటుంది.
దాన్ని నొక్కితే రకరకాల సౌండ్ ఎఫెక్టులు వినిపిస్తాయి.
అవి గ్యాస్ సౌండ్లను డామినేట్ చేస్తాయి.ఇక మరో ఫీచర్ చూస్తే… వెనకవైపు వాష్ చెయ్యాలా, ముందువైపు వాష్ చెయ్యాలా అనే రెండు బటన్లు ఉంటాయి.సహజంగా ఇవి మహిళలకు ఉపయోగపడతాయి.
జపాన్‌లో చలి ఎక్కువ.అందువల్ల టాయిలెట్ సీట్లు చల్లగా ఉంటాయి.
వాటిని ముందుగానే వేడి చేసుకునేందుకు ఓ బటన్ ఉంటుంది.దాన్ని నొక్కితే 2 నిమిషాల్లో వేడి చేస్తుంది.
ఇది మరీ అతి వేడి ఉండదు.చల్లదనం లేకుండా ఉంటుంది.
ఈ ఫీచర్లను చూపించే ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లోని allstarsteven పేజీలో మార్చి 2న పోస్ట్ చేశారు.
ఇప్పటివరకూ ఈ వీడియోని లక్ష మందికి పైగా చూడగా 11 వేల మందికి పైగా లైక్ చేశారు.
ఈ వీడియో చూసి నెటిజన్లు జపనీయులను మెచ్చుకుంటున్నారు.ఆస్ట్రేలియాలో మా టాయిలెట్లు పరమ చెత్తగా ఉంటాయని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా సౌండ్ ఎఫెక్ట్స్ కూడానా సూపర్ అని మరో యూజర్ స్పందించారు.వావ్ వెరీ నైస్ అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.ఇన్ని బటన్లు ఉన్నాయా.సౌండ్ ఎఫెక్టుల బటన్ ఉందా.ఈ విషయమే నాకు తెలియదు.
నేనెప్పుడూ ఇన్ని బటన్లను పరిశీలించలేదు” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.ఇలాంటి సౌండ్ ఎఫెక్టులు ఇచ్చే టాయిలెట్ మా అంకుల్‌కి కావాలి.
ఆయనకు ఇది చాలా అవసరం” అని మరో యూజర్ ఫన్నీ ఇమోజీలు పోస్ట్ చేశారు.