Ben stokes England all rounder : రోహిత్,సూర్య, విరాట్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్..

ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ 2022 ప్రారంభమై చివరి దశకు చేరుకుంది.సూపర్ 12 దశలో జరగాల్సిన అన్ని మ్యాచ్లు పూర్తీ అయ్యి నాలుగు జట్లు సెమీఫైనల్ కి చేరుకున్నాయి.టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో బాగంగా నవంబర్ 10వ తేదీన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ మైదానంలో టీమిండియా, ఇంగ్లాండ్ ల మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్ కి ముందు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ విరాట్ కోహ్లీ, రోహిత్, సూర్యలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 England All Rounder Who Made Interesting Comments On Rohit, Surya, Virat, Rohit,-TeluguStop.com

టి20 ప్రపంచ కప్ ముందు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లోకి రావడం మాకు ఇబ్బంది కలిగించే విషయమే.ఒక్కొక్కసారి విరాట్ ఆటను చూస్తే భయమేస్తుంది.

దాదాపు ఇప్పటికే మూడు ఫార్మేట్ లలో తనంత గొప్ప ఆటగాడు లేడని ఈ ప్రపంచానికి చూపాడు.వరల్డ్ కప్ లో స్థిరంగా పరుగులు చేస్తున్న విరాట్ ను త్వరగా అవుట్ చేయడమే మా లక్ష్యమని చెప్పాడు.

గతంలో జరిగిన మ్యాచ్ ల గురించి పట్టించుకోకుండా సెమీఫైనల్ ఆడడానికి ప్రయత్నిస్తాం అని చెప్పాడు.

Telugu Ben, Cricket, England, India, Rohit, Surya, Virat-Sports News క్ర�

అదే సమయంలో రోహిత్ శర్మ ఫామ్ పై స్పందిస్తూ హిట్‌మ్యాన్‌ ఫామ్ లో ఉంటే ఎంత ప్రమాదకరమో మాకు బాగా తెలుసు.ప్రస్తుతం అతడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడడం చూస్తుంటే జాలేస్తుంది అని చెప్పాడు.కానీ అతను ఫామ్ లోకి రావడానికి ఒక్క మంచి ఇన్నింగ్స్ అడితే చాలు.

కానీ అది మాపై ఆడకూడదని నేను గట్టిగా కోరుకుంటున్నా.ఇంకా మాట్లాడుతూ సూర్య కుమార్ ఆటపై స్పందించిన ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్రపంచానికి తన ఆటను గట్టిగా చూపిస్తున్నాడు.

అతను ఒక అద్భుతమైన ఆటగాడు ఒక్కోసారి అతను కొట్టే షాట్లు తలలు పగేలా చేస్తున్నాయి.అతను ఉన్న ఫామ్ తట్టుకోవడం ఏ జట్టుకైనా కష్టమే.

అయితే మేము మాత్రం సూర్య కుమార్ యాదవ్ ను వీలైనంత తొందరగా అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube