రోజంతా ఎనర్జిటిక్ గా, సూపర్ యాక్టివ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు.అయితే సరైన పోషకాలు అందకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల శరీరం మధ్యాహ్నానికే అలసిపోతుంటుంది.
కానీ ఇప్పుడు చెప్పబోయే ఎనర్జీ బాల్స్ ను రోజుకొకటి తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు.ప్రతి పనిలో చురుగ్గా పాల్గొంటారు.
అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు సైతం పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎనర్జీ బాల్స్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు రోల్డ్ ఓట్స్ వేసి రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై ఫ్రై చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఓట్స్ వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు ఎండు ద్రాక్ష, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ), ఆరు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి( Ghee ) వేసి వేసి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.అంతే మన ఎనర్జీ బాల్స్ సిద్ధం అయినట్టే.వీటిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ ఎనర్జీ బాల్స్ ను రోజుకొకటి చొప్పున తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.ఈ ఎనర్జీ బాల్స్ రెగ్యులర్ డైట్ లో ఉండే రోజంతా శక్తివంతంగా ఉంటారు.
నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ ఎనర్జీ బాల్స్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం( Heart Health )గా మారుతుంది.రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు.ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.
మరియు రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.