నేడే భారత్- పాకిస్తాన్ మధ్య ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ పోరు.. !

క్రికెట్ అభిమానులకు ఈరోజు పండుగే.కొలంబో వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 2:00 లకు భారత్-పాకిస్తాన్( India vs Pakistan ) మధ్య ఎమర్జింగ్ ఆసియా కప్( Emerging Asia Cup ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఏ స్థాయి టోర్నీ అయినా.భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి.ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు.ఎమర్జింగ్ ఆసియా కప్ టైటిల్ కోసం భారత్-ఏ, పాకిస్తాన్-ఏ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

 Emerging Asia Cup Final Match Between India Vs Pakistan Details, Emerging Asia C-TeluguStop.com

భారత్ ఈ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీ మ్యాచ్ లలో అజేయంగా నిలిచి ఫైనల్ కు చేరింది.ఇదే ఫామ్ కొనసాగించి పాక్ ను మట్టి కరిపించి టైటిల్ సాధించాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది.

Telugu Abhisek Sharma, Yash Dhull, Cricket, Asia Cup, Asia Cup Final, India, Ind

లీగ్ దశలో పాకిస్తాన్ ఓడించిన భారత్ ఫైనల్ మ్యాచ్ ను తేలికగా కాకుండా సీరియస్ గా తీసుకుంటేనే టైటిల్ భారత్ ఖాతాలో పడుతుంది.బంగ్లాదేశ్- భారత్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ కాస్త తడబడింది.భారత స్పిన్నర్లు నిశాంత్ సింధు, మానవ్ సుతార్ రాణించడంతో సెమీఫైనల్ లో విజయం సాధించి ఫైనల్ చేరింది.కాబట్టి ఫైనల్ మ్యాచ్లో కాస్త తడబడిన టైటిల్ చేజారే అవకాశం ఉంది.

అంతేకాకుండా బంగ్లాదేశ్ సెమీఫైనల్ లో కేవలం కెప్టెన్ మాత్రమే రాణించాడు.మిగతా భారత ఆటగాళ్లు అనుకున్న రీతిలో రాణించలేకపోయారు.

Telugu Abhisek Sharma, Yash Dhull, Cricket, Asia Cup, Asia Cup Final, India, Ind

ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ యశ్ధుల్ తో( Captain Yash Dhull ) పాటు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, ధ్రువ్ జూరెల్, నిశాంత్ సింధు రాణించగలిగితేనే సొంతంగా అవుతుంది.అంతేకాకుండా ఫీల్డింగ్ లో కూడా లోపాలను సరిదిద్దుకోవాలి.పాకిస్తాన్ జట్టులో ప్రతిభావంతులకు కొదువు లేదు.ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండడంతో జట్టు పటిష్టంగానే ఉంది.కాబట్టి భారత్ ఈ ఆటగాళ్లపై దృష్టి పెట్టి ఆడితే ఎమర్జింగ్ ఆసియా కప్ టైటిల్ భారత్ దే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube