ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటీవల మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు ప్రచారంలో భారీ ఎత్తున దూసుకుపోయాయి.
ఎవరికి వారు జనాలకు భారీగా హామీలు ప్రకటించడం జరిగింది.కానీ చివర ఆఖరికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ( Congress )పార్టీకి పట్టం కట్టడం జరిగింది.
దీంతో డిసెంబర్ 7వ తారీకు తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ( Hyderabad at LB Stadium )జరగనున్న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి.కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు.ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది.విషయంలోకి వెళ్తే వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసంలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు ప్రక్రియ ప్రారంభించారు.
ఈ మేరకు సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ లపై గ్రామ కార్యదర్శుల నుంచి వివరాలు సేకరించడం జరిగింది.ప్రస్తుత సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తారీకుతో ముగియనుంది.
దీంతో త్వరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది.ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.
అయితే ఒక నెలలోనే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది.