రేవంత్ రెడ్డి (Revanth reddy) సీఎం అవ్వడంతోనే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు.ఇక ప్రగతిభవన్ ప్రజాభవన్ గా మార్చి అక్కడ ఉన్న కంచెలన్నింటిని తీసేసి ప్రజలు ఎప్పుడు ప్రజా భవన్ కి వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు.
అంతేకాదు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో చాలామంది కనీసం ప్రగతిభవన్ గేట్ల వరకు కూడా వచ్చేవారు కాదట.కానీ కెసిఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రజా భవన్ కి ఎప్పుడు ప్రజలు వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు.
అలాగే తాజాగా రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక రేవంత్ రెడ్డి (Revanth reddy) తీసుకున్న నిర్ణయానికి దరిదాపుల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు వారి పాలనలో ఆలోచించలేదు అని ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు.ఇక రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏంటో కాదు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యి కేసుల పాలయ్యారో వారందరి మీద ఉండే కేసులన్నీ ఎత్తివేయాలని ప్రతి జిల్లాల ఎస్పీలు, డిజీపిలకు ఆదేశాలు పంపాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు బీఆర్ఎస్ పాలనలో ఎవరికి రాని ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చింది అని మెచ్చుకుంటున్నారట.ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు
.