అమెరికాలో ఉండే ఎంతో మంది ఎన్నారైలు తమ తమ ప్రాంతాలకి.తాము పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కోసం సాయం చేస్తూ ఉంటారు.
అయితే తెలంగాణలో వైద్య విద్యని చదువుకుని అమెరికాలో ఎంతో ఉన్నత స్థితిలో స్థిరపడిన ఓ వైద్యుడు తన సొంత ప్రాంతానికి ఏదన్నా చేయాలనే కోరికతో ఉస్మానియా ఆస్పత్రికి ఉచితంగా దాదాపు 3 కోట్ల రూపాయ మందులని , కొన్ని కిట్లని.అత్యాధునిక పరికరాలని ఉచితంగా అందించారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఇవన్నీ దాదాపు మూడు భారీ వాహనాల్లో వచ్చాయట, అందులో మందులు, సిరంజీలు, బీపీ ఆపరేటర్లతోపాటు శస్త్రచికిత్సాలయాల్లో వాడే అతి ముఖ్యమైన యంత్రాలు, లైట్లు, సామగ్రిని ఇటీవల ఆస్పత్రికి తీసుకొచ్చారు.వరంగల్‌లో వైద్య విద్యనభ్యసించిన అతని పేరు చరణ్‌జీత్‌రెడ్డి అమెరికాలో పేరొందిన వైద్యుడిగా స్థిరపడ్డాడు.బన్ను ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆయన రూ.3కోట్ల సామగ్రిని ఉస్మానియా ఆస్పత్రికి డొనేట్ చేశారు.
అయితే కొన్ని మందులు గడువు తేదీకి దగ్గరలో ఉండడంతో అధికారులు సూచనల మేరకు పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సనత్‌నగర్‌లోని డ్రక్స్ కంట్రోల్ కార్యాలయానికి వాహనాలను తరలించారు.పరిశీలన అనంతరం ఉస్మానియాకు తీసుకురానున్నట్లు ఉస్మానియా వర్గాలు తెలిపాయి.