చెప్పు తీసుకుని తలకు కొట్టుకున్న డాక్టర్ బాబు.. ఆడవాళ్లు అప్పుడు వదలరంటూ?

స్టార్ హీరోలకు సమానంగా బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ద్వారా నిరుపమ్ పరిటాల పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.నిరుపమ్, మంజుల కొన్నిరోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించగా ఆ ఛానల్ ను ఇప్పటికే లక్ష మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.

 Doctor Baabu Mumbai Trip Video Goes Viral In Social Media , Social Media , Docto-TeluguStop.com

మంజుల నిరుపమ్ కలిసి చేస్తున్న వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.నేను, నిరుపమ్ కలిసి ముంబైకు షూటింగ్ కు వెళుతున్నామని వీడియోలో మంజుల చెప్పుకొచ్చారు.

చిన్నప్పటి నుంచి నేర్చుకున్న హిందీ అంతా ఇప్పుడు బయటకు వస్తుందని డాక్టర్ బాబు వెల్లడించారు.టైమ్ కు పనులు జరిగితే క్రెడిట్ తన భార్య తీసుకుంటుందని అలా లేకపోతే మాత్రం తనకు క్రెడిట్ దక్కుతుందని నిరుపమ్ అన్నారు.

బాంబే వర్కింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్, ఫుడ్ డిఫరెంట్ గా ఉంటాయని నిరుపమ్ పేర్కొన్నారు.ఇద్దరూ కలిసి యాడ్ చేస్తున్నామని మంజుల వీడియోలో చెప్పుకొచ్చారు.

Telugu Baabu, Babu, Karthika Deepam, Manjula, Mumbai Trip, Slipper, Vira-Movie

మంజుల చెప్పుల షాపింగ్ చేస్తుండగా నిరుపమ్ ఆడవాళ్లు చావుబ్రతుకుల మధ్య ఉన్నా కూడా షాపింగ్ మాత్రం వదలరని తెలిపారు.నా బాధలు ఎవరికి చెప్పుకోవాలని నిరుపమ్ ప్రశ్నించారు.ఆ తర్వాత నిరుపమ్ సరదాగా చెప్పుతో కొట్టుకున్నారు.ఈ జర్నీ చాలా మెమొరీస్ ఇచ్చిందని ముంబై స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ పక్కనే స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయని నిరుపమ్ వెల్లడించారు.

Telugu Baabu, Babu, Karthika Deepam, Manjula, Mumbai Trip, Slipper, Vira-Movie

ఆ తర్వాత నిరుపమ్, మంజుల బాంద్రాలోని పలు ప్రాంతాలను సందర్శించారు.వాతావరణం కూడా చాలా బాగుందని మంజుల చెప్పుకొచ్చారు.హైదరాబాద్ లో కూడా బీచ్ ఉంటే బాగుండేదని మంజుల అభిప్రాయపడ్డారు.బ్రేక్ ఫాస్ట్ చేయకుండా హడావిడిగా వచ్చామని బ్రేక్ ఫాస్ట్ ను బాదంపాలతో సరిపెడుతున్నామని మంజుల తెలిపారు.

డాక్టర్ బాబు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్లతో పాటు ఫేమస్ స్టూడియోలను కూడా వీడియోలో చూపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube