అగ్రరాజ్యం అమెరికాలో ఆక్సిజన్ కొరత..!!

ఇండియాలో సెకండ్ వేవ్ కారణంగా అప్పట్లో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి అనేక ఇబ్బందులు ప్రభుత్వాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి అగ్రరాజ్యం అమెరికాలో ఏర్పడింది.

 Oxygen Shortage In America India, America, Florida, Texas , Delta Variant ,-TeluguStop.com

డెల్టా వేరియంట్ కేసులు ఊహించని రీతిలో రోజురోజుకి నమోదు అవుతుండటంతో డెల్టా వేరియంట్ బారిన పడిన బాధితులు ఆక్సిజన్ కొరతతో అమెరికా ఆసుపత్రుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏకంగా రోజుకీ లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యే పరిస్థితి తాజాగా ఏర్పడటంతో అక్కడ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో అమెరికా ప్రభుత్వం పరిశ్రమలకు తరలించాల్సిన ఆక్సిజన్ నీ ఆసుపత్రిలకి తరలించే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.

ముఖ్యంగా ఫ్లోరిడా, సౌత్ కలోరినా, టేక్సస్, లూసియానా ఆసుపత్రులలో కరోనా బారిన పడిన రోగులు ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏకంగా రిజర్వు చేసిన ఆక్సిజన్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో అమెరికా ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వల సామర్థ్యం పెంచుకుంటూ పోతుంది.పెద్దపెద్ద పరిశ్రమలకు వెళ్లి ఆక్సిజన్ లను ఆసుపత్రులకు తరలిస్తుంది.

సౌత్ అమెరికా లో డెల్టా కేసులు పెరుగుతూ ఉండటంతో ఆ ప్రాంతంలో పలు రాష్ట్రాలు రిజర్వ్ ఆక్సిజన్ నీ వాడటం కలవరపెడుతోంది.ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాలో డిసెంబర్ నాటికి లక్ష మరణాలు నమోదయ్యే పరిస్థితి దేశంలో ఏర్పడుతుందని ఆ దేశ టాప్ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక పక్క ప్రకృతి తుఫానులు మరోపక్క డెల్టా కేసులు నమోదు అయ్యే రీతిలో అమెరికాలో పరిస్థితి మారటంతో.ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube