తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా ఏంటో చాటుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మరోసారి దాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఇదిరా ఉంటే అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు అయిన అల్లు శిరీష్( Allu Sirish ) హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు తనకు సరైన సక్సెస్ అయితే లేదు.కాబట్టి తన కెరీర్ ని ఇప్పుడు గాడిలో పెట్టడానికి అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది.

అందులో భాగంగానే కొంతమంది స్టార్ డైరెక్టర్లతో( Star Directors ) సినిమాలు చేయించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే అల్లు శిరీష్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడం తనమీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువగా రావడంతో తన తమ్ముడిని హీరో గా నిలబెట్టాలని అల్లు అర్జున్ గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే కొంతమంది తమిళ్ డైరెక్టర్ లతో( Tamil Directors ) అల్లు శిరీష్ సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.మరి అల్లు అర్జున్ ఎంట్రీ తో అయిన అల్లు శిరీష్ సక్సెస్ కొడతాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికి అల్లు శిరీష్ చేసిన సినిమాల్లో శ్రీరస్తు శుభమస్తు( Srirastu Subhamastu ) సినిమాను మినహాయిస్తే ఆయనకి ఇప్పటి వరకు మరొక సక్సెస్ అయితే దక్కలేదు.ఆయన ఎంచుకునే స్టోరీ లే సరిగ ఉండటం లేదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు…
.