జై భీమ్ సినిమా( Jai Bhim ) తెలుగు తమిళ భాషల్లో విడుదల ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు.ఈ సినిమాలో సూర్య మెయిన్ లీడ్ గా నటించినప్పటికీ చిన్నతల్లి పాత్రలో నటించి నటికి మరింత గుర్తింపు వచ్చింది.
ఇక ఈ సినిమాలో మరొక పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అదే చిన్న తల్లి భర్త రాజకన్ను పాత్ర.ఈ సినిమాలో అతడే నట విశ్వరూపం ఏంటో మనం అందరం చూసాం.ఈ సినిమాలో ఎక్కువగా తమిళ నటీనటులే నటించారు.దానిని తెలుగులో కేవలం డబ్బింగ్ మాత్రమే చేశారు.ఏది ఏమైనా ఆ కొన్ని సినిమాలు తీయాలంటే అది తమిళ్ వారికి మాత్రమే సాధ్యమవుతుంది అందులో జై భీమ్ కూడా ఖచ్చితంగా అలాంటి సినిమానే.

అయితే జై భీమ్ సినిమాలో రాజకన్ను పాత్రలో నటించిన నటుడు మరెవరో కాదు.ఇక చిన్న తల్లి పాత్రలో నటించిన నటి పేరు లిజోమోల్ జోషి( Lijomol Jose )ఆదివాసి దంపతులుగా ఈ సినిమాలో నటించి ఆ తర్వాత తమిళనాడు లో ట్రెండ్ క్రియేట్ చేశారు.తెలుగులో వీరిద్దరూ కూడా తమ తమ సినిమాలతో బాగానే అలరిస్తున్నారు.
లిజోమోల్ జోసీ ఒరే బామ్మర్ది( Orey Baammardhi ) అనే చిత్రంలో నటించగా ప్రస్తుతం ఒక పెద్ద ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక మణికంఠన్( Manikanda ) తెలుగులో గుడ్ నైట్ అనే పేరుతో మరోసారి ప్రభంజనం సృష్టించాడు.
ఈ సినిమా ఓటిటి లో మాత్రమే విడుదలైన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యింది.

ఈ సినిమా తర్వాత మరో సినిమాతో కూడా ప్రస్తుతం మణికంఠం తెలుగువారికి బాగా కనెక్ట్ అవుతున్నాడు అదే ట్రూ లవర్ ( True Lover )చిత్రం.ఈ సినిమా తాజాగా విడుదల ఈ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది.ఇలా జై భీమ్ సినిమాతో మొదలుపెట్టి వరుస సినిమాల్లో విజయాలు సాధిస్తూ తెలుగులో కూడా అదే రేంజ్ విజయాలను అందుకుంటూ ప్రస్తుతం మంచి హీరోగా గుర్తింపు పొందుతున్నాడు మణికంఠన్ జై భీమ్ సినిమాలో అతడిని చూసిన వారంతా ఎవరో సాదాసీదా వ్యక్తీ అనుకున్నారు కానీ ఇప్పుడు హీరోగా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తుంటే చాలామంది లేడీ ఫ్యాన్స్ అతనికి ఏర్పడుతున్నారు.