టాలీవుడ్ మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.( Bro Movie ) ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
రోజురోజుకీ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతకు మెచ్చేస్తున్నారు మూవీ మేకర్స్.ఇటీవల చిత్రం బృందం ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ లుక్ ని రివిల్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని వీడియోని కూడా విడుదల చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సాయి ధరంతేజ్ కి సంబంధించిన లుక్ ని విడుదల చేశారు.

ఈ సినిమాలో మార్కండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉందంటూ ఆడియన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు.అయితే సినిమాలో పాటలకి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో మొత్తం 5 పాటలు ఉన్నాయట.అందులో పవన్ కళ్యాణ్ పైనే రెండు పాటలు ఉండగా వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది.
ఇక ఈ సాంగ్ లో పవన్ తో చిందులేసేందుకు ఇద్దరు భామల పేరులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకరు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ,( Disha Patani ) మరొకరు గబ్బర్ సింగ్ బ్యూటీ శ్రుతి హాసన్.( Shruti Hasan ) వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మూవీ టీం ఫైనల్ చేయనుందట.సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ నటించబోతుందని తెలుస్తుంది.
మరో అందాల భామ ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించబోతుందని సమాచారం.కాగా ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.