పుష్ప సినిమా ద్వారా కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు నటుడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఈయనకు నార్త్ ఇండియాలో విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు.
సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీల సైతం అల్లు అర్జున్ కు అభిమానులుగా మారిపోవడం విశేషం.ఈ క్రమంలోనే ఇదివరకే అల్లు అర్జున్ స్టైల్ తనకు నచ్చిందని ఆయన చేసిన ఇలాంటి పాత్రలో తనుకు నటించాలని ఉందంటూ రణబీర్ కపూర్ అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
తాజాగా మరొక బాలీవుడ్ ముద్దుగుమ్మ తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నటి దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా పటాన్ని తన ఫేవరెట్ హీరో గురించి వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అనీ టక్కున సమాధానం చెప్పడమే కాకుండా, అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఈమె తెలిపారు.ఇకపోతే ఇప్పటివరకు తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా… తాను సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నానని అయితే ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్టుకే సినిమాతో ఆ కోరిక కూడా తీరిపోయిందని ఈ సందర్భంగా దిశా పటాని టాలీవుడ్ ఎంట్రీ గురించి తన ఫేవరెట్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.