డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవతార్ 2.ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయా సాల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగర్నీ వీవర్, కేట్ విన్ స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాను లైట్ స్ట్రోమ్ ఎంటర్టైన్మెంట్, టీ ఎస్ జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ కామెరున్, జోన్ లాండౌ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ సినిమాకు రస్సెల్ కర్పెంటర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.
సైమన్ ఫ్రాంగ్లెన్ సంగీతాన్ని అందించారు.అయితే ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూశారు.మొత్తానికి ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
ఈ సినిమా ఇదివరకే పార్ట్ వన్ గా విడుదలై ఎంతలా హిట్ అందుకుందో చూసాం.సామ్ వర్తింగ్టన్ ఇందులో జేక్ పాత్రలో కనిపించాడు.ఇక భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ అక్కడే మరో తెగకి చెందిన నేతిరి (జోయా సాల్డానా) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
ఇక దీంతో జేక్ తన భార్య నేతిరి తండ్రి వారసత్వాన్ని పుచ్చుకోవటంతో ఆ తెగకి నాయకుడవుతాడు.ఆ తర్వాత వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుడతారు.అంతేకాకుండా దత్తపుత్రిక కిరీ, స్పైడర్ అనే మరో బాలుడితో కలిసి ఈ దంపతులు జీవిస్తారు.అయితే ఆ సమయంలో భూ ప్రపంచం అంతరించిపోతుందని ఎలాగైనా పండోరాని ఆక్రమించి అక్కడున్న నావి తెగను అందం చేయాలి అని మనుషులు దండెత్తుతారు.
దీంతో జేక్ తన కుటుంబాన్ని రక్షించుట కోసం మరో ప్రాంతమైన మెట్కయినా కు వెళ్తాడు.అయితే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు సముద్రమే ప్రపంచం.ప్రతి విషయంలో సముద్రమనే నమ్ముకుంటారు.అయితే ఆ ప్రాంతం రాజు అయిన టోనోవరీ సహకారంతో జేక్ కుటుంబం కూడా ఆ సముద్రంతో అనుబంధం పెంచుకుంటుంది.కానీ భూమి నుంచి వచ్చిన ప్రధాన శత్రువు మైల్స్ క్వారీచ్ (స్టీఫెన్ లాంగ్) జేక్ కుటుంబాన్ని మట్టు పెట్టడం కోసం తన బృందంతో పోరాటం చేస్తాడు.ఇక ఆ పోరాటం ఎలా జరిగింది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఇందులో కీలక పాత్రలో నటించిన వర్తింగ్ టన్ అద్భుతంగా నటించాడు.తన కుటుంబాన్ని పోషించే విధానం పాత్రలో మాత్రం బాగా ఎమోషనల్ చూపించాడు.
ఇక నెగిటివ్ పాత్రలో నటించిన స్టీఫెన్ కూడా బాగా నటించాడు.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ ఈ సినిమాకు ఈ పార్ట్ లో మంచి కథను అందించాడు.ప్రతి విభాగాన్ని అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఇక మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగా ఉన్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమా మొత్తం అడవి, జీవరాశుల ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ది వే ఆఫ్ వాటర్ తో వచ్చిన కాన్సెప్ట్ మాత్రం అద్భుతంగా ఉంది.నిజానికి డైరెక్టర్ ఈ సినిమాను నీటి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.
ప్లస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ గా ఉన్నాయి.సినిమా స్టోరీ, ఎమోషనల్స్, సముద్ర నేపథ్యంలో అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
కాస్త సమయం సాగదీసినట్లు అనిపించింది.కథలో మలుపు లేకపోయింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా నీటి ప్రపంచంలో మాయాజాలం లాంటిది అని చెప్పవచ్చు.కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.