హీరో కాకముందు నందమూరి బాలకృష్ణ బాలనటుడిగా ఆయన తండ్రి ఎన్టీఆర్ తో అనేక సినిమాల్లో నటించాడు.ఎన్టీఆర్ తో నటించడమే కాదు, ఆయన దర్శకత్వం లో కూడా పనిచేసాడు బాలయ్య.
హీరో అయిన తర్వాత కూడా ఆయన ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాల్లో నటించాడు.వాటిలో ఒకటి ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామీ’( Sri Madvirat Veerabrahmendra Swamy )ఈ చిత్రం ఎన్టీఆర్ టైటిల్ పాత్ర ని పోషించగా, బాలయ్య బాబు ఆయన శిష్యుడు సిద్దప్ప పాత్రలో నటించాడు.
ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ని స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన చిత్రం ఇది.కమర్షియల్ గా ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయ్యింది.ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న సమయం లో విడుదలైన ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ కి ఎన్నో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను ఇచ్చింది.

ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వచించాడు.ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమా, సెన్సార్ బోర్డు వారు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం తో, ఎన్టీఆర్ విడుదలను ఆపేసి, నా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సినిమాని విడుదల చేస్తాను అని చెప్పి రిలీజ్ చేసాడు.ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయం లోనే బాలయ్య కి ఎన్టీఆర్ దర్శకత్వం లో ఓనమాలు దిద్దించాడని అప్పట్లో టాక్ ఉండేది.షాట్ మేకింగ్ ఎలా చెయ్యాలి, కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాడట.
అంతే కాదు, ఈ సినిమాకి ఒక పక్క ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తుంటే, ఎన్నో సన్నివేశాలకు బాలయ్య కెమెరా మెన్ గా కూడా పని చేసాడాట.అలా బాలయ్య( Balakrishna ) తన కెరీర్ మొత్తం మీద కెమెరామెన్ గా పని చేసిన ఏకైక చిత్రం ఇదేనని అంటున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమా చూస్తే ఎన్టీఆర్ దస్రకత్వ ప్రతిభ ఎలాంటిదో మరోసారి అందరికీ అర్థం అవుతుంది.వీరబ్రహ్మేంద్ర స్వామినే వెండితెర మీదకి వచ్చి నటించాడా అనే అనుభూతిని ఎన్టీఆర్ తన దర్శకత్వ ప్రతిభ తో అనిపించాడు.ఈ సినిమానే కాదు ఎన్టీఆర్ దర్శకత్వం లో గతం లో ఎన్నో సినిమాలు తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాయి.ఈ చిత్రం తర్వాత కూడా ఎన్టీఆర్ పలు సినిమాల్లో నటించాడు.
ముఖ్యమంత్రి గా పని చేస్తున్న రోజుల్లోనే మేజర్ చంద్ర కాంత్( Major Chandrakanth ) అనే చిత్రం కూడా విడుదలైంది.