ఐపీఎల్ లో బోణి కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్..!

ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) ఐదు వరుస ఓటములతో సతమతమవుతూ ఎట్టకేలకు సొంత వేదికపై కోల్ కత్తా పై చెలరేగి మొదటి విజయం సాధించింది.ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఇది తొలి విజయం కాగా.

 Delhi Capitals Hit The Hole In The Ipl , Ipl, Delhi Capitals, Sports, Delhi Cap-TeluguStop.com

కోల్ కత్తా( kole katta ) ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో ఓడి, రెండు మ్యాచ్లలో గెలిచింది.మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా 127 పరుగులు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.ఎట్టకేలకు ఈ ఐపీఎల్లో మొదటి విజయం ఖాతాలో పడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి.ఒకవైపు వరుస ఐదు ఓటములు.మరొకవైపు క్రికెట్ కిట్ల చోరీ తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి విజయం కాస్త ఊరటను ఇచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవైపు ఫీల్డింగ్ లోను.మరొకవైపు బ్యాటింగ్ లోను అద్భుత ఆటను ప్రదర్శించింది.మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా ను ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేయడంతో కోల్ కత్తా కేవలం 127 పరుగులు చేసింది.

ఆ తరువాత లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ ఆరంభంలో కాస్త తడబడిన డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో 11 ఫోర్ లతో 57 పరుగులు చేశాడు.డేవిడ్ వార్నర్( David Warner ) అవుట్ తర్వాత పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిన ఢిల్లీ జట్టును మనీష్ పాండే 23 బంతుల్లో 21 పరుగులు, అక్షర్ పటేల్( Akshar Patel ) 22 బంతుల్లో 19 పరుగులు చేయడంతో ఎట్టకేలకు ఢిల్లీ ఖాతాలో తొలి విజయం నమోదయింది.

ఢిల్లీ జట్టు బౌలర్లు కట్టడి చేయడంతో కోల్ కత్తా బ్యాటర్లు పరుగులు చేయలేక చేతులెత్తేశారు.కోల్ కత్తా జట్టులో జేసన్ రాయ్( Jason Roy ) 43 పరుగులు, ఆండ్రూ రస్సెల్ 38 పరుగులు చేశారు.

మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేదు.చివరి ఓవర్ లో రస్సెల్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన ప్రయోజనం లేకుండా పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube