నీకు ముందే చెప్పాగా.. నిన్నూ వాడుకొని వదిలేస్తారని.. దివ్యావాణిపై శ్రీరెడ్డి సెటైర్?

నటి దివ్య వాణి తాజాగా టిడిపి అధికారంపై మండిపడింది.టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పేసింది.

 Controversial Actress Sri Redd Satires On Divyavani Over Quit Tdp Sri Reddy, Di-TeluguStop.com

అంతే కాకుండా ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.టిడిపి పార్టీ నేతలు తనను ఎదగనీయకుండా చేశారని టీడీపీ అధినేతకు మనసాక్షి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడింది దివ్యవాణి.

టిడిపిలో పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.ఈ క్రమంలోనే నటి దివ్యవాణికీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ముందే చెప్పాను అంటూ బరిలోకి దిగింది సంచలన నటి శ్రీరెడ్డి.

టిడిపి పార్టీ నేతలకు వాడుకొని వదిలేయడం అలవాటే.ఇప్పటికైనా దివ్యవాణి కళ్ళు తెరవాలి అంటూ హితవు పలికింది శ్రీ రెడ్డి.అయితే దివ్యవాణి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడో చెప్పానని, అలాగే టిడిపి పార్టీ వాళ్లు మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి వదిలి పెడతారు అని చెప్పానని, డబ్బులు సంపాదించడం మాట పక్కన పెడితే పార్టీలోకి వెళ్లిన తర్వాత సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ముందే చెప్పాను అని తెలిపింది శ్రీరెడ్డి.దివ్యవాణి వంగలపూడి అనిత ప్రొఫెసర్ అని, అచ్చం నాయుడుని టార్గెట్ చేస్తూ పార్టీ లేదు బొక్క లేదు అంటూ వారిపై విరుచుకు పడిన విషయం తెలిసిందే.

Telugu Andra Pradesh, Chandra Babu, Divya Vani, Sri Reddy, Tollywood-Movie

ఇదే విషయంపై స్పందిస్తూ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉండే మీరు వేరే పార్టీ వాళ్ళను వేసుకుంటారు అనుకుంటే.మీరు మీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇరగొట్టేశారు అది నాకు చాలా బాగా నచ్చింది.మనసుకు చాలా తృప్తిగా ఉంది అని తెలిపింది శ్రీరెడ్డి.కేవలం మీరే కాదు ఇది వరకు సాధినేని యామిని లాంటి వాళ్లు కూడా టీడీపీ నుంచి వెళ్లిపోయిన వాళ్లే అని తెలిపింది శ్రీరెడ్డి.

అనంతరం మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కాబట్టి నాకు టిడిపి మీద గౌరవం ఉంది.కానీ కొంతమంది పార్టీలకు వచ్చి ఆ పేరును చెడగొట్టారు అని తెలిపింది శ్రీరెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube