తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీల మద్య వ్యూహ ప్రతివ్యూహాలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి.మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే పక్కా ప్రణాళికతో వ్యూహాలను రెడీ చేసుకున్నాయి.
ఈ విషయంలో అధికార బిఆర్‌ఎస్ కొంత ముందంజలో ఉంది.ఇప్పటికే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించిన కేసిఆర్.
( CM kcr ) ఇక మేనిఫెస్టో పై దృష్టి పెట్టారు.కాగా ప్రస్తుతం బిఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ పార్టీ హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది.
త్వరలో కాంగ్రెస్ కూడా లోలి జాబితా అభ్యర్థులను ప్రకటించనుండగా.అటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలను కూడా సిద్దం చేసుకుంటోంది.
![Telugu Cm Kcr, Congress, Harish Rao, Telangana-General-Telugu Telugu Cm Kcr, Congress, Harish Rao, Telangana-General-Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/Congress-party-BRS-party-telangana-politics-CM-kcr.jpg)
అయితే అధికారం కోసం ఆరాట పడుతున్న హస్తంపార్టీ బిఆర్‌ఎస్ ( BRS party )ను ఫాలో అవుతోందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఆధికార బిఆర్‌ఎస్ తొలి జాబితాలో ఏకంగా 115 మందిని ప్రకటించింది.ఇప్పుడు సేమ్ అధెవిధంగా హస్తం పార్టీ కూడా మొదటి జాబితాలో 115 మంది లేదా పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతోందట.ఒక్క అభ్యర్థుల విషయంలోనే కాకుండా హామీల విషయంలో కూడా ఆధికార బిఆర్‌ఎస్ ను ఫాలో అవుతోంది హస్తం పార్టీ, ప్రస్తుతం కేసిఆర్ సర్కార్ రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తుంటే.కాంగ్రెస్ పార్టీ 15 వేలు ఇస్తామని చేబుఃతోంది.
![Telugu Cm Kcr, Congress, Harish Rao, Telangana-General-Telugu Telugu Cm Kcr, Congress, Harish Rao, Telangana-General-Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/Congress-party-BRS-telangana-politics-CM-kcr.jpg)
అంతే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని హస్తం పార్టీ చెబుతోంది.ఇంకా నెలకు రూ.2016 రూపాలను పెన్షన్ గా కేసిఆర్ సర్కార్ ఇస్తుంటే.దానిని నాలుగు వేలు చేస్తామని కాంగ్రెస్( Congress party ) చేబుఃతోంది.ఇంకా దళితబంధు పథకం కింద ఎస్సీ లకు రూ.10 లక్షల రూపాయలు ఇస్తామంటే.కాంగ్రెస్ ఏకంగా 12 లక్షలు ఇస్తామని ఇంకా ఈ పథకాన్ని ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా అమలు చేస్తామని చెబుతోంది.దీంతో హస్తం పార్టీ ప్రకటిస్తున్న హామీలన్నీ బిఆర్‌ఎస్ హామీలను పోలి ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇది కొంత కాంగ్రెస్ కు మైనస్ గా మారే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.మరి మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ స్వచ్చందంగా వ్యవహరిస్తుందా లేదా బిఆర్‌ఎస్ మేనిఫెస్టోనే కాపీ కొడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
మొత్తానికి కాంగ్రెస్ ను బిఆర్‌ఎస్ అప్డేటెడ్ వర్షన్ గా చెబుతున్నారు కొందరు రాజకీయవాదులు.