తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి.రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ తో కలిసి ఎన్నికలకు వెళ్తామని, తాము ఆశించిన అన్ని స్థానాలను కేసీఆర్ ( CM kcr )పొత్తులో భాగంగా తమకు కేటాయిస్తారని సిపిఐ,( CPI ) సిపిఎం పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.
అయితే రెండు రోజుల క్రితం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.కనీసం వామపక్ష పార్టీల నేత్రలను సంప్రదించకుండానే లిస్టును ప్రకటించడంపై ఎర్ర పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారని, అప్పుడే వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు ఇచ్చారని , కానీ ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని తమను పక్కన పెట్టారని ఫైర్ అవుతున్నారు.
![Telugu Brs, Munugodu, Telangana-Politics Telugu Brs, Munugodu, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Telangana-elections-BJP-munugodu-elections-CPI-CPM-CM-kcr.jpg)
దీంతో ఇప్పుడు వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ ( Congress )ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తోంది.మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టు పార్టీల నేతలను కాంగ్రెస్ నేతలు కోరినా.బిజెపిని ఓడించే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని , ఆ పార్టీతోనే తాము పొత్తు పెట్టుకుంటామని, కాంగ్రెస్ ను అవమానించే విధంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు కామెంట్స్ చేశారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ వామపక్ష పార్టీలను పక్కన పెట్టడంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా మారింది.
![Telugu Brs, Munugodu, Telangana-Politics Telugu Brs, Munugodu, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Telangana-Congress-BRS-party-Telangana-government-KCR-Telangana-elections-BJP-munugodu-elections-CPI.jpg)
కెసిఆర్ తమను ఘోరంగా అవమానించారని వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహంతో ఉన్నారు.అందుకే బీఆర్ఎస్ ( BRS party )ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో జతకట్టాలని నిర్ణయానికి వచ్చారు.ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన రెండు పార్టీల నేతలు విడివిడిగా సమావేశాలు నిర్వహించి చర్చించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హారహోరిగా ఉంటుందని, దక్షిణ తెలంగాణలో సిపిఐ , సీపీఎం పార్టీలు కీలకంగా మారుతాయి అని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ ,రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తమ రెండు పార్టీల మద్దతు కాంగ్రెస్ కు అవసరమని , కాంగ్రెస్ మద్దతు తమకు అవసరమని తమ మూడు పార్టీలు కలిస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అనే లెక్కలను ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారు ఎర్ర పార్టీల నేతలు.