Congress:డోర్నకల్ టికెట్ ఫైట్.. అధిష్టానం మనసులో ఉన్నదెవరో..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది.ఇదే తరుణంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి.

 Congress Dornakal Ticket Fight Who Has The Leadership In Mind-TeluguStop.com

ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఆల్మోస్ట్ అన్ని టికెట్లను ప్రకటించి ప్రచారంలో ఉంది.ఇదే తరుణంలో మంచి ఫామ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ( Congress ) పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో తర్జనభజన అవుతుంది.60 నుంచి 70 నియోజకవర్గాలు మినహా మిగతా అన్నిచోట్ల ఇద్దరు నుంచి ముగ్గురు నేతలు టికెట్ల కోసం హోరాహోరీ పోరాడుతున్నారు.నాకు వస్తుందంటే నాకు వస్తుంది అంటూ ఎవరి ప్రచారం వారే చేస్తూ ముందుకు పోతున్నారు.

ఇదే తరుణంలో డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.అక్కడ ముగ్గురు నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకొని నాకు వస్తుందంటే నాకు వస్తుందని రెడీగా ఉన్నారు.

మరి వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం.

Telugu Bhupal Nayak, Congress, Congress Ticket, Dornakal, Nehru Nayak, Redya Nay

మూడు దశాబ్దాల నుంచి డోర్నకల్ నియోజకవర్గాన్ని శాసిస్తున్నారు రెడ్యానాయక్( Redya nayak ).కానీ ఈసారి రెడ్యానాయక్ ని, ఓడించే సత్తా మాకే ఉందని ఈ ముగ్గురు నేతలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు.ఆ ముగ్గురు నేతలు ఎవరయ్యా అంటే.

రామచంధ్రునాయక్, భూపాల్ నాయక్, నెహ్రూ నాయక్.ఈ ముగ్గురు నాయకులు డోర్నకల్ కాంగ్రెస్ టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రచారం చేస్తూ కార్యకర్తలను ఆగమాగం చేస్తున్నారు.దీంతో కార్యకర్తలు ఎవరితో ప్రచారం చేయాలో తెలియక తలలు పీక్కుంటున్నారట.

ఎందుకంటే ఈ ముగ్గురిలో ఫైనల్ గా టికెట్ ఎవరికి వస్తుంది అనేదే సవాలుగా మారింది.ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట అయిన డోర్నకల్( Dornakal ), ఆ తర్వాత రెడ్యానాయక్ బీఆర్ఎస్ లో చేరడంతో ఆ వైపు మగ్గింది.

కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్ బీఆర్ఎస్ లో చేరిన తర్వాత అక్కడ కాంగ్రెస్ తరపున మరో ముగ్గురు లీడర్లు తయారయ్యారు.మరోసారి బరిలో దిగేందుకు రెడ్యా నాయక్ రెడీ అయిన సందర్భంలో ఆయన ఓడించేందుకు ఈ ముగ్గురు నేతలు సమయతమయ్యారు.

రెడ్యా నాయక్ కు దీటుగా వచ్చేది, నేనంటే నేనంటూ వారికి వారే మీసాలు తిప్పుకుంటూ తొడలు కొట్టుకుంటున్నారు.

Telugu Bhupal Nayak, Congress, Congress Ticket, Dornakal, Nehru Nayak, Redya Nay

ఇందులో నెహ్రూ నాయక్( Nehru nayak ) , భూపాల్ నాయక్ ఇద్దరు వ్యాపారం చేసే వ్యక్తులు.ఇక రామచంద్రనాయక్ ( Ramachandra nayak ) వైద్య వృత్తిలో ఉన్నారు.అయితే మొన్నటి వరకు నెహ్రూ నాయక్, రామచంద్రనాయక్ మధ్య పోటీ ఉండేది.2018 ఎన్నికల్లో రామచంద్రనాయక్, రెడ్యాపై పోటీ చేశారు.కొత్తగా భూపాల్ నాయక్ ఎంట్రీ తో కాంగ్రెస్ పార్టీలో త్రిముఖ పోరు నడుస్తోంది.

అయితే ఈ ముగ్గురు నేతలు తాజాగా ఎవరికి వారే సెల్ఫ్ సర్వేలు నిర్వహించుకొని వారి బలం ఏంటో అధిష్టానానికి చూపించుకోవడానికి అనేక కసరత్తులు చేస్తున్నారు.మరి సిడబ్ల్యూ కమిటీలో ఎవరి పేరు ఉందో వారు ప్రకటిస్తే కానీ తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube