తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా ? 

తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.దీంతో రాజకీయ పార్టీలు హడావుడి మొదలుపెట్టాయి.

 Will Ycp Contest Telangana Elections Or Not , Telangana Asembly Elections, Tel-TeluguStop.com

బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా,   కాంగ్రెస్ బిజెపీలు అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్నాయి .తెలంగాణ ఎన్నికల( Telangana election ) షెడ్యూల్ విడుదల కాగా,  నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు .అలాగే ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న ఒకే స్టేజ్ లో జరగనుంది.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించనున్నారు.

ఇక ఎన్నికల్లో తాము కూడా పోటీలో ఉన్నామని ఇప్పటికే జనసేన ప్రకటించింది.తెలుగుదేశం పార్టీ సైతం ఎన్నికల్లో పోటీ చేయబోతోంది.

అయితే జనసేన , టిడిపిలు ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ పొత్తులు పెట్టుకుని,  ఎన్నికలకు వెళ్తారా అనేది క్లారిటీ లేదు.

Telugu Congress, Janasena, Telangana, Ysrcp, Yv Subba Reddy-Politics

 ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది ఎవరికి క్లారిటీ లేదు .తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS )తో వైసిపి సన్నిహితంగానే ఉంటుంది.ముఖ్యంగా తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం జగన్ ( CM kcr AP CM jagan )మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.

ఇక కేంద్రంలో బీజేపీతోను జగన్ సన్నిహితంగానే మెలుగుతున్నారు.ఈ క్రమంలో వైసిపి తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతుండగా … తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీకి కీలక నేత,  మాజీ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ( YV Subba Reddy )స్పందించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం వైసిపి( YCP )కి లేదని సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.ఈరోజు ప్రకాశం జిల్లా పర్యటనలో వై వి సుబ్బారెడ్డి అనేక అంశాలపై స్పందించారు.

Telugu Congress, Janasena, Telangana, Ysrcp, Yv Subba Reddy-Politics

కృష్ణ జలాల విషయంలో రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన విధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు పంపకాలు జరిగాయని సుబ్బారెడ్డి ( YV Subba Reddy )తెలిపారు.  జగన్ ఇప్పటికే సమీక్షలు నిర్వహించారని , కేంద్రాన్ని కలిసి అన్ని అంశాలను వివరిస్తారని,  అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని సుబ్బారెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube