బాహుబలి రేంజ్ సినిమాలో సాయితేజ్.. ఈ సినిమాతో క్రేజ్ ఎన్నో రెట్లు పెరగనుందా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంబరాల ఏటిగట్టు.( Sambarala Yetigattu ) అయితే ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు.

 Sai Dharam Tej Sdt18 Movie First Look Details, , Sai Dharam Tej, Tollywood, Firs-TeluguStop.com

ప్రస్తుతానికి ఈ సంబరాల ఏటిగట్టు అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా చిన్న గ్లింప్స్ ని విడుద‌ల చేశారు.వ‌ర‌ల్డ్ బిల్డింగ్ ని ప‌రిచ‌యం చేస్తూ సాగిన గ్లింప్స్ ఇది.

చివ‌ర్లో హీరోని వెనుక నుంచి చూపించారు.ఆ క‌టౌట్ అదిరింది.

ఆ మేకొవ‌ర్ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Telugu Sai Dharam Tej, Sai Durgha Teja, Sai Tej Sdt, Sdt, Sdt Glimpse, Tollywood

నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ సాయి తేజ్ బొద్దుగా క‌నిపించేవాడు.కానీ ఈ సినిమా కోసం బాగా త‌గ్గాడు.పైగా కండ‌లు పెంచాడు.

ఆ క‌టౌట్‌, గ్లింప్స్ లోని వాతావ‌ర‌ణం చూస్తుంటే ఇది సాయితేజ్ బాహుబ‌లినా( Baahubali ) అనేంతలా ఆశ్చ‌ర్యం వేస్తోంది.కాగా ఈ సినిమాను స్వాతంత్ర్యం రాక‌పూర్వం జ‌రిగిన ఓకే య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిస్తున్నట్లు పిలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమా కోసం ఓకే గ్రామ‌మే సృష్టించారట.యుద్ధ స‌న్నివేశాల‌కు చాలా ప్రాధాన్యం ఉంది.

వాటికి సంబంధించిన విజువ‌ల్స్ కూడా గ్లింప్స్ లో చూపించారు.టైటిల్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.దాదాపు రూ.100 కోట్ల‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.

Telugu Sai Dharam Tej, Sai Durgha Teja, Sai Tej Sdt, Sdt, Sdt Glimpse, Tollywood

సాయితేజ్ కెరీర్‌లో నిర్మిత‌మ‌వుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఇదే.అయితే ఈ సినిమాతో తప్పకుండా సాయి ధరంతేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.అంతేకాకుండా ఈ సినిమా కోసం సాయి ధరంతేజ్ కూడా కొంచెం గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం తన బాడీని కూడా మార్చుకున్నారట సాయి ధరమ్ తేజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube