బాహుబలి రేంజ్ సినిమాలో సాయితేజ్.. ఈ సినిమాతో క్రేజ్ ఎన్నో రెట్లు పెరగనుందా?
TeluguStop.com
మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంబరాల ఏటిగట్టు.
( Sambarala Yetigattu ) అయితే ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు.
ప్రస్తుతానికి ఈ సంబరాల ఏటిగట్టు అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు.
వరల్డ్ బిల్డింగ్ ని పరిచయం చేస్తూ సాగిన గ్లింప్స్ ఇది.చివర్లో హీరోని వెనుక నుంచి చూపించారు.
ఆ కటౌట్ అదిరింది.ఆ మేకొవర్ అందరిని ఆశ్చర్యపరిచింది.
"""/" /
నిన్నా మొన్నటి వరకూ సాయి తేజ్ బొద్దుగా కనిపించేవాడు.కానీ ఈ సినిమా కోసం బాగా తగ్గాడు.
పైగా కండలు పెంచాడు.ఆ కటౌట్, గ్లింప్స్ లోని వాతావరణం చూస్తుంటే ఇది సాయితేజ్ బాహుబలినా( Baahubali ) అనేంతలా ఆశ్చర్యం వేస్తోంది.
కాగా ఈ సినిమాను స్వాతంత్ర్యం రాకపూర్వం జరిగిన ఓకే యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు పిలుస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమా కోసం ఓకే గ్రామమే సృష్టించారట.యుద్ధ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది.
వాటికి సంబంధించిన విజువల్స్ కూడా గ్లింప్స్ లో చూపించారు.టైటిల్ ఇంకా ప్రకటించలేదు.
దాదాపు రూ.100 కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం.
"""/" /
సాయితేజ్ కెరీర్‌లో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే.అయితే ఈ సినిమాతో తప్పకుండా సాయి ధరంతేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమా కోసం సాయి ధరంతేజ్ కూడా కొంచెం గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
అందుకోసం తన బాడీని కూడా మార్చుకున్నారట సాయి ధరమ్ తేజ్.
స్పెషల్ సాంగ్స్ కు సై అంటున్న టాలీవుడ్ బ్యూటీలు.. ఆఫర్లతో జాతకం మారుతుందా?