యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామాల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూర్ (ఎం)ఎస్ హెచ్ ఓ సాల్మన్ రాజు అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలకు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు బంగారు ఆభరణాలను ధరించి ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదని,వాటిని జాగ్రత్తగా సేఫ్టీ ప్లేస్ లో భద్రపరుచుకోవాలని,ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలోకి రానివ్వకుండా,వీలైనంత వరకు దూరంగా ఉండి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు ఊరి ప్రయాణాలు చేసే సమయంలో మీ వివరాలను పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని,
అలాగే మీ పక్కింటి వారికి చెప్పాలన్నారు.మండలంలో ఎక్కడైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
యువకులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,మత్తుకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.మత్తుకు అలవాటుపడి వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, అలాగే ఈజీ మనీ కోసం దొంగతనాలు కూడా చేస్తారని తెలిపారు.
అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లల దినచర్యపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణయ్య,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.