ఏపీ ఎన్నిక సమయంలో టిడిపి, జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు విషయమై టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) దూకుడు పెంచారు.ఒకవైపు గత వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఇప్పటికీ ఎత్తి చూపిస్తూనే, గత ప్రభుత్వ నిర్ణయాల వల్లనే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఆలస్యం అవుతుందని, వీలైనంత త్వరలో ఆ హామీలను అమలు చేసి చూపిస్తామని పదే పదే చంద్రబాబుతో పాటు, కూటమి పార్టీల నాయకులు చెప్తున్నారు.
ఈరోజు నిర్వహించిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో వీటిపై అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి కీలక అంశాల పైన ప్రధానంగా చర్చించారు.
ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపైన చర్చించారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో రుణాల రీ షెడ్యూల్ లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, ఆలయాల పాలక మండళ్ళ నియామకంలో తట్ట సవరణ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, నూతన పారిశ్రామిక విధానం , కొత్త మునిసిపాలిటీలలో పోస్టుల భర్తీ వంటి అంశాల పైన ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా అనేక నిర్ణయాలను తీసుకున్నారు.
ఏపీ క్లీన్ ఎనర్జీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.2024 – 29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0 కి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది .20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ఎస్కో ఖాతాలో వేసేలా పాలసీని తీసుకొచ్చారు.
నూతన ఎం ఎస్ ఎం ఈ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో ఎం ఎస్ ఎం పాలసీని తీసుకువచ్చారు.
మల్లవెల్లి పారిశ్రామిక పార్క్ లో 349 మందికి భూమి కేటాయింపుల పైన ఏపీ క్యాబినెట్( AP Cabinet ) నిర్ణయం తీసుకుంది .ఇంకా అనేక అంశాలపై ఏపీ క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు.